క్లాస్‌లో ఏసీ నుంచి బయటకు వచ్చిన పాము.. దెబ్బకి విద్యార్థులు..?

క్లాస్ జరుగుతుండగా హఠాత్తుగా ఏసీ వెంట్( AC vent ) ద్వారా పాము తరగతి గదిలోకి ప్రవేశించిన ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.

మొదట పామును చూసి భయపడిన విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్దగా అరవడంతో పాము మళ్లీ ఏసీ వెంట్‌లోకి వెళ్లింది.

ఈ ఘటన నోయిడాలోని అమిటీ యూనివర్సిటీలో ( Amity University, Noid )చోటుచేసుకుంది.పాము టీచర్ తలపై ఉన్న ఏసీ వెంట్ ద్వారా తరగతి గదిలోకి ప్రవేశించింది.

తొలుత పాము తల కొద్దిగా బయటికి పెట్టి కాస్త ముందుకు రాగానే.విద్యార్థులు భయంతో అరవడం మొదలు పెట్టారు.ఇక కొందరు భయపడిన విద్యార్థులు తమ కుర్చీలపైకి ఎక్కారు.

దీంతో తరగతిలో గందరగోళం నెలకొంది.తరగతి గదిలో శబ్దం విని పాము మళ్లీ ఏసీ వెంట్‌లోకి వెళ్ళిపోయింది.

Advertisement

ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడం ఊరటనిచ్చే అంశం.క్లాస్‌లో ఉన్న ఓ విద్యార్థి తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.ఇటీవల కురిసిన వర్షాల తర్వాత పాములు ప్రజల నివాస ప్రాంతాల్లోకి ప్రవేశించడం సర్వసాధారణంగా మారిందని., ఇటీవల గ్రేటర్ నోయిడాలో ఓ పెద్ద కొండచిలువ పట్టుబడిందని.

, అలాగే చిన్న జింకను మింగిన కొండచిలువను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారని తెలిపారు.అమిటీ యూనివర్శిటీలో జరిగిన సంఘటన విద్యాసంస్థల్లో, చుట్టుపక్కల భద్రతా చర్యలు అలాగే వన్యప్రాణులు రాకుండా ఉండే నిర్వహణపై ప్రశ్నలను లేవనెత్తింది.

క్యాంపస్‌లో విద్యార్థులు, సిబ్బందికి భద్రత కల్పించేందుకు అధికారులు చురుగ్గా చర్యలు తీసుకోవాలని కోరారు.వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఈ రెండు రెమెడీస్ ను పాటిస్తే హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు!
ప్రొఫెసర్‌ను ప్రాంక్ చేయాలనుకున్న కాలేజీ స్టూడెంట్స్.. లాస్ట్ ట్విస్ట్ మాత్రం..

ఇలాంటి ఘటన వల్ల విద్యార్థులు భయపడే అవకాశం ఉందని., ఇలాంటి సంఘటనలు జరగకుండా కళాశాల యజమాన్యం తగు చర్యలు తీసుకోవాలని చాలామంది కామెంట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు