హీరోయిన్ భుజంపై చేయి వేస్తూ అలా ప్రవర్తించిన విద్యార్థి.. వీడియో వైరల్?

అపర్ణ బాలమురళి.ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ఆకాశం నీ హద్దురా.

 Student Misbehaves With Aparna Balamurali In A College ,student Misbehaves, Apar-TeluguStop.com

ఈ సినిమాతో ఈమె టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా చేరువ అయ్యింది.అంతేకాకుండా ఈ సినిమాలో ఆమె నటనకు అభిమానులు ఫిదా అయ్యారు.

అంతేకాకుండా ఆకాశం నీ కద్దురా సినిమాలో నటనకు గాను అపర్ణ బాలమురళీ జాతీయస్థాయిలో మంచి నటిగా కూడా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.ఇందులో హీరోగా సూర్య నటించిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే అపర్ణ బాలమురళి తాజాగా నటించిన చిత్రం తన్కమ్.ఈ సినిమాలో అపర్ణ బాలమురళి తో పాటు బీజూ మీనన్, వినీత్ శ్రీనివాసన్ కూడా నటించారు.

కాగా ఈ మూవీ ఈనెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ ను ప్రారంభించారు.ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా అపర్ణ బాలమురళి అలాగే, శ్రీనివాసన్ కేరళలోని ఒక కాలేజీకి వెళ్లారు.

అక్కడ విద్యార్థులతో కలిసి ముచ్చటించారు.అంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈ నేపథ్యంలోనే అపర్ణకు ఒక ఊహించని చేదు సంఘటన ఎదురైంది.సినిమాల్లో చూసే వాళ్లను ఒకేసారిగా లైవ్ లో చూడడంతో ఒక విద్యార్థి అత్యుత్సాహం ప్రదర్శించాడు.

యాంకర్ మాట్లాడుతున్న సమయంలో స్టేజి మీదకు ఎక్కి అపర్ణ బాలమురళికి పువ్వు ఇచ్చాడు.అంతటితో ఆగకుండా ఆమె చేయి పట్టుకుని ఫోటో ఇవ్వాలని కోరాడు.అందుకు అపర్ణ చిరునవ్వు చిందిస్తూ ఫోటో దిగడానికి వచ్చింది.

అప్పుడు ఆ విద్యార్థి కాస్త చనువు తీసుకొని అపర్ణ భుజంపై చేయి వేసేందుకు ప్రయత్నించగా ఆమె వెంటనే పక్కకు తప్పుకుంది.అప్పుడు మర్యాదగా చేతులు కట్టుకొని ఫోటో అడగడంతో ఆమె ఫోటోకి ఫోజులిచ్చి పక్కకు వెళ్లి కూర్చుంది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ వీడియో చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.కొందరు అపర్ణ బాలమురళికి అనుగుణంగా కామెంట్స్ చేస్తుండగా మరికొందరు ఆ విద్యార్థికి అనుగుణంగా కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చినా అపర్ణ బాలమురళికి చేదు అనుభవం ఎదురయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube