చిన్నారిపై సవతి తల్లి రాక్షసత్వం.. అన్నం అడిగితే సీలింగ్ కు వేలాడదీసింది!

చిన్నారులను కంటికి రెప్పలా చూసుకుంటారు తల్లి దండ్రులు.వారికి ఏ చిన్న దెబ్బ తాకినా వారి కంటే ఎక్కువ బాధ వాళ్లు అనుభవిస్తారు.

చిన్న బాధ ఎదురైనా విలవిల లాడిపోతారు.వారికి కష్టం వస్తే తల్లిదండ్రులు తట్టుకోలేరు.

అడక్కముందే అది తిను, ఇది తిను అంటూ వారి వెంట పడతారు.వాళ్లు మారాం చేస్తుంటే ఓపికగా భరిస్తారు.

అల్లరి చేస్తే వాళ్లు సంతోషిస్తారు.బుజ్జగిస్తారు.

Advertisement

ఆడిస్తారు.పాడిస్తారు.

అన్ని రకాలుగా వారికి సపర్యలు చేస్తారు.తల్లిదండ్రులను ఎప్పుడూ ఒక బాధ వెంటాడుతూ ఉంటుంది.

ఒక వేళ తామకు ఏదన్న జరగరానిది జరిగితే.వారి పరిస్థితి ఏమిటన్నది వారి మదిని తొలచివేస్తుంది.

తమకు ఏమీ కావొద్దని.పిల్లలు అనాథలు అవుతారని చాలా బాధపడుతూ ఉంటారు.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
సినిమా ట్రైలర్స్ వ్యూస్ వెనుకున్న అసలు మోసం ఏంటో తెలుసా?

ఎందుకంటే తమ పిల్లలను తాము చూసుకున్నంత ప్రేమగా ఎవరూ చూసుకోరని వారి భయం.వారు లేకపోతే తమ పిల్లలను ఎవరైనా కొడతారేమోనని అనుమానం.ఇప్పుడు చెప్పబోయే ఘటన వింటుంటే.ఒళ్లు గగుర్పొడుస్తుంది.

Advertisement

తల్లి లేకపోతే మిగతా వాళ్లు చంటి బిడ్డలు అని కూడా చూడకుండా ఎంత చిత్రవధ పెడతారో తలుచుకుంటే కాళ్లు, చేతులు వణుకుతాయి.మధ్రప్రదేశ్ మందసౌర్ లో ఏడేళ్ల చిన్నారిని సవతి తల్లి చిత్రహింసలు పెట్టింది.

అన్నం పెట్టమని అడిగినందుకు.సీలింగ్ కు కట్టి వేలాడదీసింది.

పాఠశాలకు కూడా పంపకుండా ఇంట్లో పనులు చేయించుకుంటుంది.చిన్నారిని కొడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆ బాలికను అధికారులు సంరక్షణ గృహానికి తరలించారు.