కొన్ని నెలల క్రితం వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలోని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో కృతిశెట్టి ( Krithi Shetty ) ఒకరనే సంగతి తెలిసిందే.అయితే వరుస ఫ్లాపుల వల్ల కృతిశెట్టి మార్కెట్ తగ్గింది.
అయితే కృతిశెట్టికి తాజాగా కొత్త సినిమా ఆఫర్ వచ్చిందని ఆ సినిమాలో కృతి బికినీలో( Krithi Shetty Bikini ) కనిపించనున్నారని తెలుస్తోంది.ఈ సినిమాకు కృతిశెట్టికి 4 కోట్ల రూపాయల రేంజ్ లో ఆఫర్ చేశారని సమాచారం.
కృతిశెట్టి ఈ ఆఫర్ విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.కృతిశెట్టి నటిస్తున్న కస్టడీ ( Custody ) మే నెల 11వ తేదీన రిలీజ్ కానుంది.
నాగచైతన్య, కృతి కాంబినేషన్ లో బంగార్రాజు బ్లాక్ బస్టర్ హిట్ కాగా కస్టడీ కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేసే అవకాశం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.కృతిశెట్టికి ఆఫర్ చేసిన మొత్తం ఎక్కువ మొత్తం కాగా ఆ ఆఫర్ కు ఓకే చెబితే కృతి కెరీర్ మలుపు తిరిగిందని తెలుస్తోంది.

కృతిశెట్టి కెరీర్ పరంగా తప్పటడుగులు వేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇతర హీరోయిన్లు సైతం కృతిశెట్టికి గట్టి పోటీ ఇస్తున్నారు.కృతిశెట్టికి ఆఫర్లు ఇవ్వడానికి స్టార్ హీరోలు సైతం జంకుతున్నారు.శ్రీలీల కృతిశెట్టికి వచ్చిన ఆఫర్లను సొంతం చేసుకుంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.శ్రీలీల పారితోషికం సైతం పెరుగుతున్న సంగతి తెలిసిందే.

డ్యాన్స్ అద్భుతంగా చేయడం, ఎక్స్ ప్రెషన్లను అద్భుతంగా పలికించడం, పెద్ద హీరోలకు సైతం జోడీగా నటించడం ఈ బ్యూటీకి ప్లస్ అవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.రాబోయే రోజుల్లో కృతిశెట్టి, శ్రీలీలలలో ఎవరు పై చేయి సాధిస్తారో తెలియాల్సి ఉంది.ఈ ఏడాది కృతిశెట్టికి కలిసిరావాలని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కృతిశెట్టి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ కు దగ్గరవుతున్నారు.







