సోషల్ మీడియా ప్రభంజనం ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చీమ చిటిక్కుమన్నా కూడా ఎవ్వరూ విడిచిపెట్టరు.
ఒకవేళ ఏదైనా ఫేక్ చేస్తున్నారని గమనిస్తే చాలు విపరీతమైన ట్రోలింగ్ కి ( Trolling ) గురయ్యే అవకాశం ఉంటుంది.
మరి మన ఇండియా నుంచి కొంతమంది సెలబ్రిటీస్ అలా ఇండియా దాటి పక్క దేశం వెళ్ళగానే ఫేక్ యాక్సెంట్ తో( Fake Accent ) సోషల్ మీడియా ముందు అడ్డంగా దొరికిపోయి ట్రోల్ కి గురయ్యారు వారెవరో ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇండియాలో ఉంటే మామూలుగా మాట్లాడే మన సెలబ్రిటీసు హాలీవుడ్ సినిమాలు లేదా హాలీవుడ్ మీడియా ఫోకస్ చేసింది అని తెలిస్తే చాలు వారి యాసనే మార్చేస్తారు.తామేదో ఫారన్ లోనే పుట్టి పెరిగినట్టుగా మాట్లాడి అక్కడ మీడియా ముందు ఫేక్ చేయడానికి ప్రయత్నిస్తారు.కానీ అక్కడ మాట్లాడినవి సోషల్ మీడియాలో బయటకు రాగానే మన ఇండియన్స్ ట్రోలింగ్ మొదలు పెడతారు.
అందుకు మా తెలుగు వారు కూడా అతీతమేమీ కాదు జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) ఆర్ఆర్ఆర్( RRR ) సినిమాకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిందని తెలియగానే ఇంటర్నేషనల్ మీడియా ముందు ఫారన్ యాక్సేంట్ మాట్లాడే ప్రయత్నం చేసి మీడియా ముందు దొరికిపోయాడు.
ఇక ఐశ్వర్యారాయ్( Aishwarya Rai ) కేన్స్ రెడ్ కార్పెట్ పై కూడా ఇలాగే ఫేక్ యాక్సెంట్ ఉపయోగించి త్రోలింగ్ కి గురయ్యారు ప్రియాంక చోప్రా( Priyanka Chopra ) కూడా హాలీవుడ్ సినిమాల్లో నటిస్తుంది కాబట్టి అక్కడ మీడియా ముందు తెలుగు యాక్సెంట్ కాకుండా ఫారన్ యాక్సెంట్ మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ప్రతిసారి.ఇక రామ్ చరణ్( Ram Charan ) కూడా జూనియర్ ఎన్టీఆర్ తరహాలోనే గ్లోబల్ గ్లోబ్ అవార్డ్స్ సమయంలో అమెరికన్ ఇంగ్లీష్ మాట్లాడబోయి బొక్క బోర్ల పడ్డారు.అలాగే స్లం డాగ్ మిలియనీర్ సినిమా విడుదల సమయంలో అనిల్ కపూర్( Anil Kapoor ) కూడా అలా మాట్లాడి ఫేక్ యాక్సెంట్ దొరికిపోయారు.
లండన్ లో సిటడెల్ ప్రీమియర్ షో సమయంలో సమంత( Samantha ) కూడా ఇలాగే మీడియా ముందు దారుణంగా బుక్ అయ్యింది.కరీనా కపూర్( Kareena Kapoor ) సైతం ఈ ట్రోలింగ్ కి బాధితురాలే.
రెడ్ సీ ఫిల్మ్ ఫెస్ట్ టైం లో ఆమె తన యాక్సెంట్ నీ ఫేక్ చేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy