ఎన్టీఆర్30.ఈ సినిమా ఆలస్యం అయ్యే కొద్దీ రోజుకొక రూమర్స్ వస్తున్నాయి.
ఈ రూమర్స్ మొదట్లో బాగానే ఉన్న ఇప్పుడు మాత్రం వైలెంట్ అవుతున్నాయి అనే చెప్పాలి.ట్విట్టర్ లో ఫేక్ ఐడిలతో రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు.
ఈ అబద్ధపు ప్రచారాన్ని నమ్మి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.ముఖ్యంగా హీరోయిన్ ల విషయంలో రోజుకొకరు పేరు బయటకు వస్తుంది.
ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారా అని మొదటి నుండి కూడా చర్చ జరుగుతూనే ఉంది.ఇప్పటికే బాలీవుడ్ నుండి టాలీవుడ్ దాకా అందరి పేర్లు వినిపిస్తున్నాయి.
కియారా అద్వానీ, పూజా హెగ్డే, సమంత, రష్మిక మందన్న, అలియా భట్ ఇలా అందరి పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి.ఇక తాజాగా మరొకరి పేరు కూడా వినిపించింది.
తాజాగా మేకర్స్ హీరోయిన్ గా మహానటి కీర్తి సురేష్ ను సంప్రదించినట్టు ప్రచారం జరుగుతుంది.అయితే ఈ వార్తలపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది.
ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కీర్తి సురేష్ ను మేకర్స్ సంప్రదించలేదని టాక్.ఈ ప్రచారం ఎప్పుడు అయితే బయటకు వచ్చిందో అప్పటి నుండి కీర్తి సురేష్ పై ట్రోలింగ్ జరుగుతుంది.
కీర్తి సురేష్ ను సెలెక్ట్ చేసారు అంటూ వైరల్ అవడంతో అనవసరంగా ఈమెను సెలెక్ట్ చేసుకున్నారు అని ఆమె ఏ మాత్రం సెట్ అవ్వదు అని ట్రోలింగ్ చేస్తున్నారు.ఇలా కీర్తిని ఈ సినిమాలోకి లాగి మరీ ఈమెను ట్రోల్ చేస్తున్నారు.
దీంతో చిత్ర యూనిట్ ఏదొక అప్డేట్ ఇస్తే తప్ప ఈ రూమర్స్ ఆగేలా లేవు అంటున్నారు.

మరి ఎన్టీఆర్ కు జోడీగా నటించబోయే ఆ లక్కీ హీరోయిన్ ఎవరు అనేది తెలుసుకోవాలని అందరు ఎదురు చూస్తున్నారు.ఇక ఎన్టీఆర్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.ఎన్టీఆర్ ఆర్ట్స్ ఇంకా యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మితం అవుతుంది.







