ఆదిపురుష్ కు ప్రభాస్ రెమ్యునరేషన్ అంత తక్కువా..?

స్టార్ హీరో ప్రభాస్ కు బాహుబలి సిరీస్ సినిమాలతో ఇమేజ్, క్రేజ్ భారీగా పెరిగింది.

ప్రభాస్ సినిమాలను వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కించడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతారనే సంగతి తెలిసిందే.

ప్రభాస్ ఆదిపురుష్ సినిమాకు వంద కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారని గతంలో వార్తలు వచ్చాయి.అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం వైరల్ అయిన వార్తలో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది.ప్రభాస్ ఆదిపురుష్ సినిమాకు కేవలం 50 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకున్నారని సమాచారం.50 కోట్ల రూపాయలు ఎక్కువ మొత్తమే అయినా ప్రభాస్ రేంజ్ కు ఈ పారితోషికం తక్కువే అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా షూటింగ్ పూర్తైన తరువాత నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ నటించనున్నారు.

ఆదిపురుష్ సినిమా పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Star Hero Prabhas Remuneration For Adipurush Movie, Adipurush, Adipurush Movie,

ఈ సినిమాలో ప్రభాస్ మినహా మిగిలిన నటులలో ఎక్కువమంది బాలీవుడ్ స్టార్స్ కావడం గమనార్హం.ఈ సినిమాలో రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా ఆదిపురుష్ సినిమా తెరకెక్కనుంది.

Advertisement
Star Hero Prabhas Remuneration For Adipurush Movie, Adipurush, Adipurush Movie,

ఓం రౌత్ ఒక కార్యక్రమంలో ప్రభాస్ ను చూసి రాముడి పాత్రకు ప్రభాస్ సరైన వ్యక్తి అని భావించి ఈ సినిమాకు ఎంపిక చేశారు.ప్రభాస్ లో తాను ఆదిపురుష్ ను చూశానని దర్శకుడు చెప్పుకొచ్చారు.

Star Hero Prabhas Remuneration For Adipurush Movie, Adipurush, Adipurush Movie,

వచ్చే ఏడాది ఆగష్టు నెలలో ఈ సినిమా రిలీజ్ కానుంది.తెలుగుతో పాటు ఇతర భాషల్లో దర్శకనిర్మాతలు ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా టీసిరీస్ ఈ సినిమాను తెరకెక్కిస్తూ ఉండటం గమనార్హం.

కరోనా వల్ల షూటింగ్ ఆలస్యం అవుతున్నా అనుకున్న తేదీకి ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!
Advertisement

తాజా వార్తలు