ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అన్న ప్రభాస్.. ఫ్యాన్స్ గురించి ఇంత గొప్పగా చెప్పే స్టార్ హీరో ఉండరుగా!

స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) ఈశ్వర్ సినిమా నుంచి కల్కి సినిమా( Kalki ) వరకు ఎన్నో విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు అంచెలంచెలుగా ఎదిగి ప్రశంసలు అందుకున్నారు.

గత పదేళ్లలో ప్రభాస్ సాధించిన స్థాయిలో భారీ విజయాలను సొంతం చేసుకున్న మరో హీరో లేరనే చెప్పాలి.

తాజాగా ప్రభాస్ కల్కి సినిమా గురించి మాట్లాడుతూ అభిమానుల వల్లే కల్కి సినిమా సక్సెస్ సాధించిందని ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అని కామెంట్లు చేశారు.ఫ్యాన్స్ గురించి ఇంత గొప్పగా చెప్పే హీరో ప్రభాస్ మాత్రమేనని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్ అంచెలంచెలుగా ఎదుగుతూ దేశంలోనే నంబర్ వన్ హీరో అనిపించుకుంటున్నారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఫ్యాన్స్ గురించి గొప్పగా చెప్పే స్టార్ హీరో ప్రభాస్ మాత్రమేనని ఇంతలా ఫ్యాన్స్ కు రెస్పెక్ట్ ఇచ్చే హీరోలు అరుదుగా ఉంటారని చెప్పవచ్చు.

సినిమాసినిమాకు రేంజ్ ను పెంచుకుంటున్న ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్( Rajasaab ) అనే సినిమాలో నటిస్తున్నారు.ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని అన్ని ప్రముఖ బ్యానర్లలో నటిస్తూ కెరీర్ పరంగా అంచెలంచెలుగా ఎదుగుతున్నారు.ప్రభాస్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

Advertisement

ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో మార్కెట్ ను ఊహించని స్థాయిలో పెంచుకుంటూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.

ప్రభాస్ మార్కెట్ ను పెంచే ప్రాజెక్ట్ లలో నటిస్తే ఆయన కెరీర్ మరింత పుంజుకుంటుంది.ఇప్పటికే 1000 కోట్ల కలెక్షన్ల మార్క్ ను క్రాస్ చేసిన కల్కి నిర్మాతలకు మంచి లాభాలను అందించింది.ఫుల్ రన్ లో ఈ సినిమా 1200 కోట్ల రూపాయల కలెక్షన్ల మార్క్ ను టచ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.

ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తూ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తున్నారు.

రామ్ సినిమాలు ఫ్లాప్ కావడానికి అసలు కారణాలివేనా.. ఆ రీజన్ వల్లే ఫ్లాపవుతున్నాయా?
Advertisement

తాజా వార్తలు