తారకరత్న కోసం అక్కడ అఖండ జ్యోతి వెలిగించిన బాలయ్య.. పూజలు చేస్తూ?

స్టార్ హీరోలలో ఒకరైన నందమూరి బాలకృష్ణకు దైవభక్తి ఎక్కువ కాగా జాతకాలు, ముహూర్తాలను బాలయ్య ఎక్కువగా నమ్ముతారు.తన సినిమాలకు సంబంధించిన డేట్ల విషయంలో కూడా బాలయ్య ముహూర్తాలను ఫాలో అవుతారు.

 Star Hero Balakrishna Pooja For Tarakaratna Details, Balakrishna, Taraka Ratna,-TeluguStop.com

తారకరత్న ఆరోగ్యం నిలకడగానే ఉన్నా ఆయన పూర్తిస్థాయిలో కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని వైద్యులు చెబుతున్న సంగతి తెలిసిందే.

తారకరత్న స్పృహలోకి ఎప్పుడు వస్తారనే ప్రశ్నకు సైతం సరైన సమాధానం దొరకడం లేదు.

అయితే తారకరత్నను బ్రతికించడానికి ఒకవైపు వైద్యులు తమ వంతు ప్రయత్నాలు చేస్తుండగా మరోవైపు బాలయ్య పూజలు చేస్తున్నారు.తారకరత్న త్వరగా కోలుకోవాలి బాలయ్య చిత్తూరు జిల్లాలో ఉన్న మృత్యుంజయ స్వామి ఆలయంలో 44 రోజుల పాటు అఖండ జ్యోతి వెలిగించేలా తన సిబ్బంది ద్వారా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

Telugu Akhanda Jyothi, Balakrishna, Pooja, Taraka Ratna-Movie

సోదరుడి కొడుకుపై బాలయ్య చూపిస్తున్న ప్రేమ, వాత్సల్యానికి సోషల్ మీడియాలో ప్రశంసలు దక్కుతున్నాయి.భోజనం మానేసి మరీ ఆస్పత్రికి పరిమితమైన బాలయ్య తాత్కాలికంగా అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.మరోవైపు మరికొన్ని గంటల్లో అన్ స్టాపబుల్ షోకు పవన్ గెస్ట్ గా హాజరైన ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.పవన్ తో పాటు సాయితేజ్ ఈ ఎపిసోడ్ లో కనిపించనున్నారు.

Telugu Akhanda Jyothi, Balakrishna, Pooja, Taraka Ratna-Movie

ఈ ఎపిసోడ్ లో పవన్ తన పొలిటికల్ ప్లాన్స్ కు సంబంధించి కీలక విషయాల గురించి వెల్లడించనున్నారు.ఈ ఎపిసోడ్ వాడీవేడిగా ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.మరోవైపు బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ షూట్ కు సంబంధించి అప్ డేట్స్ రావాల్సి ఉంది.ఈ సినిమాలో స్టార్ హీరో బాలయ్యకు జోడీగా కాజల్ నటిస్తున్నట్టు ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రావడంతో పాటు దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube