ఆ ఇద్దరు హీరోలు అన్ స్టాపబుల్ షోకు రావడం బాలయ్యకు ఇష్టం లేదా?

స్టార్ హీరో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో సీజన్2 ఫస్ట్ ఎపిసోడ్ ప్రేక్షకులకు బాగా నచ్చగా సెకండ్ ఎపిసోడ్ కు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది.

సెకండ్ ఎపిసోడ్ లో బాలయ్య స్థాయికి తగిన హీరోలు గెస్ట్ లుగా హాజరు కాలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమయ్యాయి.

అయితే కొంతమంది హీరోలు ఈ షోపై ఆసక్తి చూపిస్తున్నా బాలయ్య వారు ఈ షోకు రావడంపై ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య షోకు రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే బాలయ్య నుంచి కానీ ఈ షో నిర్వాహకుల నుంచి కానీ ఆహ్వానం అందలేదు.బాలయ్య హోస్ట్ గా తారక్ గెస్ట్ గా హాజరైతే అన్ స్టాపబుల్ షో రీచ్ కూడా ఊహించని స్థాయిలో పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

అయితే బాలయ్య ఆసక్తి చూపకపోవడం వల్ల ప్రస్తుతం తారక్ ఈ షోకు హాజరయ్యే అవకాశాలు దాదాపుగా లేనట్టేనని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.మెగాస్టార్ చిరంజీవి ఈ షోకు గెస్ట్ గా హాజరు కానున్నారని వార్తలు గతంలో జోరుగా ప్రచారంలోకి వచ్చాయి.

Advertisement
Star Hero Balakrishna Not Interested To Invite Two Heroes Details Here , Balakr

అయితే సంక్రాంతి పండుగకు చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి.చిరంజీవిని ఈ షోకు గెస్ట్ గా పిలిచే అవకాశం ఉన్నా ఆ నిర్ణయానికి కూడా బాలయ్య ఏ మాత్రం ఆసక్తి చూపలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Star Hero Balakrishna Not Interested To Invite Two Heroes Details Here , Balakr

అందువల్ల అన్ స్టాపబుల్ సీజన్2 కు చిరంజీవి గెస్ట్ గా హాజరు కావడం కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అన్ స్టాపబుల్ సీజన్2 కు పాపులారిటీ ఉన్న సెలబ్రిటీలు రావడం కష్టమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఫస్ట్ సీజన్ స్థాయిలో అన్ స్టాపబుల్ సీజన్2 సక్సెస్ అయ్యే అవకాశాలు తక్కువేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ కామెంట్ల విషయంలో షో నిర్వాహకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు