బాలకృష్ణకు రూ.6 కోట్ల బహుమతి ఇచ్చిన హరీష్ రావు.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.

బాలకృష్ణ గతేడాది బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన అఖండ సినిమాలో అఘోర పాత్రలో అద్బుతంగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు.

ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలయ్య నటిస్తున్న సినిమాకు సంబంధించి వేర్వేరు విడుదల తేదీలు ప్రచారంలోకి వస్తున్నాయి.

దసరా కానుకగా ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తే బాగుంటుందని బాలయ్య అభిమానులు భావిస్తున్నారు.బాలయ్య ఒకవైపు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా మరోవైపు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి బాధ్యతలను నిర్వహిస్తూ ప్రశంసలను అందుకుంటున్నారు.

అయితే తెలంగాణ మంత్రి హరీష్ రావు బాలకృష్ణ ఆరు కోట్ల రూపాయల విలువలైన బహుమతి ఇచ్చారు.అయితే ఈ బహుమతి వ్యక్తిగతంగా ఇచ్చిన బహుమతి కాకుండా పేదలకు మేలు చేసే ఉద్దేశంతో ఇచ్చిన బహుమతి కావడం గమనార్హం.

Advertisement

బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చెల్లించాల్సిన ఆరు కోట్ల రూపాయల పన్నుకు తెలంగాణ సర్కార్ మినహాయింపును ఇచ్చింది.

ఇందుకు సంబంధించి బాలయ్య స్పందిస్తూ హరీష్ రావును జన నాయకుడని పేర్కొన్నారు.హరీష్ రావును తాను ఒకసారి కలిస్తే ఆరు కోట్ల రూపాయల పన్నును మాఫీ చేశారని బాలయ్య చెప్పుకొచ్చారు.హరీష్ రావు మాట్లాడుతూ బాలయ్య వేర్వేరు రంగాలలో రాణిస్తున్నారని తెలిపారు.

బాలయ్య, హరీష్ రావు ఒకరి గురించి మరొకరు గొప్పగా చెప్పుకోవడం గమనార్హం.బాలయ్య అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా రాజశేఖర్ కనిపిస్తారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లతో బ్లాక్ బస్టర్ హిట్లు సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

బాలయ్య ఒక్కో సినిమాకు 12 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు