Prabhas : ప్రభాస్ తో సినిమా కోసం 8 సంవత్సరాలు గా ఎదురుచూస్తున్న స్టార్ డైరెక్టర్…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్( Young Rebel Star ) గా తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నా హీరో ప్రభాస్.

ప్రస్తుతం ఈయన పాన్ ఇండియాలో స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా ఇండస్ట్రీలో ఎవరికి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.

ఇక ఈయన ఇంటర్నేషనల్ లో ఒక సినిమా చేస్తే మాత్రం తప్పకుండా ఈయన పాన్ వరల్డ్ హీరో అయిపోతారు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక బాహుబలి 2 సినిమాతో దాదాపు విదేశాల్లో కూడా తన సత్తా చాటిన ప్రభాస్( Hero Prabhas ) తన తదుపరి సినిమాలతో ఇంటర్నేషనల్ స్థాయి కి వెళ్ళాలని చూస్తున్నాడు.

ఇక ఇది ఇలా ఉంటే ఒక డైరెక్టర్ ప్రభాస్ తో 8 సంవత్సరాల నుంచి ఒక సినిమా చేయాలని చూస్తున్నాడట.

Star Director Murugadoss Waiting For Prabhas Dates

ఇక ఇదిలా ఉంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన మురగదాస్( Director Murugadoss 0 ప్రభాస్ తో సినిమా చేయడానికి దాదాపు 8 సంవత్సరాలనుంచి ఎదురుచూస్తున్నాడు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.అయితే ఈయన ప్రభాస్ కి కథ చెప్పి సినిమా స్టార్ట్ చేద్దాం అని అనుకున్న సమయంలోనే బాహుబలి సినిమా( Baahubali )ని అనౌన్స్ చేశారు.ఇక దాంతో ఆయన ఐదు సంవత్సరాల వరకు అటే లాక్ అయిపోయారు.

Advertisement
Star Director Murugadoss Waiting For Prabhas Dates-Prabhas : ప్రభాస

ఇక ఆ తర్వాత బాహుబలి సెట్స్ మీద ఉండగానే వరుసగా రెండు మూడు ప్రాజెక్టులను ఒప్పుకున్నాడు.దాంతో మురుగదాస్ ప్రభాస్ కథ చెప్పే అవకాశం అయితే ఇప్పటివరకు రాలేదు.

Star Director Murugadoss Waiting For Prabhas Dates

ఇక దానితో ఇప్పుడు మురుగదాస్ అంత ఫామ్ లో లేడు.కాబట్టి ఇప్పుడు ప్రభాస్ కి కథ చెప్పిన డేట్స్ ఇస్తాడనే గ్యారంటీ లేదు.ఇక దానికి తోడుగా ప్రభాస్ ఇప్పటికే వరుసగా నాలుగు సినిమాలు కమిటై ఉన్నాడు.

ఇక అవి పూర్తి అవ్వాలంటే మరో రెండు సంవత్సరాలు ఈజీగా పడుతుంది.కాబట్టి ఇక మురుగదాస్ కి వెయిటింగ్ చేయడం తప్ప ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం లేదని ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

Jyothamma Jabardast : మానవత్వం మర్చిపోయిన ఓ సమాజమా ..అగ్గి తో కడగాలి నిన్ను !
Advertisement

తాజా వార్తలు