శంకర్ సినిమాలు గ్రాఫిక్స్ తప్ప ఇంకేం ఉండవు! స్టార్ కమెడియన్ సంచలన వాఖ్యలు

సౌత్ ఇండియాలో స్టార్ దర్శకుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి శంకర్.

తన మొదటి సినిమా ప్రేమికుడు నుంచి తాజాగా వచ్చిన రోబో 2.

ఓ వరకు చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి.అదే సమయంలో శంకర్ అంటే భారీ బడ్జెట్ చిత్రాలు, అలాగే స్టార్ హీరోలు మాత్రమే కనిపిస్తారు.

సోషల్ ఎలిమెంట్స్ కి తనదైన స్క్రీన్ ప్లే జోడించి అద్బుతంగా ఆవిస్కరించగల సత్తా శంకర్ సొంతం.ఇక అతని ప్రతి సినిమాలో కూడా అంతర్లీనంగా ఒక సామాజిక సందేశం కచ్చితంగా ఉంటుంది.

అందుకే శంకర్ సినిమాలు ఎంత బడ్జెట్ అయిన ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు.అలాగే శంకర్ తో సినిమాల కోసం నిర్మాతలు కూడా క్యూ కడుతూ ఉంటారు.అయితే ఇంత మందిని మెప్పించిన దర్శక దిగ్గజం ఒక్క కమెడియన్ ని మాత్రం మెప్పించలేకపోయాడు.

Advertisement

తమిళనాడు బ్రహ్మానందంగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చెసుకున్న కమెడియన్ వడివేలు.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమికుడు సినిమాతో తమిళనాడులో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న వడివేలుని హీరోగా పెట్టి శంకర్ గతంలో హింసరాజు 23వ పులకేశి అనే సినిమాని నిర్మించాడు.

ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.ఇదిలా ఉంటే ఆ సినిమా సీక్వెల్ విషయంలో వడివేలుకి, శంకర్ కి మధ్య గొడవలు తలెత్తాయి.

ఇక ఫైనల్ గా కోర్ట్ ఆదేశాలతో వడివేలు ఈ సీక్వెల్ చేయాల్సి వస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా వడివేలు శంకర్ పై సంచలన వాఖ్యలు చేసాడు.

శంకర్ సినిమాలలో గ్రాఫిక్స్ తప్ప కథ అంటూ ఏమీ ఉండదని, అతను గ్రాఫిక్స్ లేకుండా సినిమాలు తీయలేడని విమర్శలు చేసాడు.ఇప్పుడు వడివేలు విమర్శలు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయాయి.

Nutmeg Helps To Lose Weight After Delivery Nutmeg, Lose Weight, Delivery, After Delivery, Latest
Advertisement

తాజా వార్తలు