సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి సినిమా వస్తుంది అంటే ఫ్యాన్స్ లో ఒకలాంటి క్రేజ్ అయితే ఉంటుంది.మరి మన టాలీవుడ్ నుండి ప్రెజెంట్ తెరకెక్కుతున్న పలు క్రేజీ కాంబోల్లో మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో ఒకటి.
ఈ కాంబోలో ప్రస్తుతం హ్యాట్రిక్ సినిమా తెరకెక్కుతుంది.మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
త్రివిక్రమ్ డైరెక్టర్ కావడంతో ముందు నుండి ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.మరి త్రివిక్రమ్ కూడా వీరి అంచనాలకు తగినట్టుగానే సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.
SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ప్రెజెంట్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. భారీ యాక్షన్ ఎలిమెంట్స్ తో త్రివిక్రమ్ ఈ సినిమాను ప్లాన్ చేసారు.ఇక ఈ క్రేజీ కాంబో అప్పుడే తన పవర్ చుపిస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇప్పటికే మన ఇండియాలో ఓటిటి రైట్స్ ను భారీ డీల్ కు 81 కోట్లతో నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.ఇప్పుడు యూఎస్ లో కూడా ఈ సినిమా భారీగా బిజినెస్ జరుపుతున్నట్టు తెలుస్తుంది.

యూఎస్ లో 4 మిలియన్ కి పైగా బిజినెస్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది.ఇది పాన్ ఇండియన్ సినిమాల్లో బిగ్గెస్ట్ రికార్డ్ అనే చెప్పాలి.ఈ సినిమా పూర్తి కాకుండానే ఈ రేంజ్ లో బిజినెస్ జరగడంతో ఫ్యాన్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమాలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్ లుగా నటిస్తున్నారు.
అలాగే ఈ సినిమాలో జగపతిబాబు విలన్ గా నటిస్తుండగా. ఆగస్టు 11న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.







