రాజమౌళి సినిమా కోసం మహేష్ అన్నేళ్లు పనిచేయనున్నారా?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవ లే గ్రాండ్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

మహేష్ బాబు ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.

ఈ సినిమా జులై నెలలో సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం అందుతుంది.ఇక ఇందులో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.

హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమా తర్వాత మహేష్ బాబు అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు.

ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా అడవుల బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ కావడంతో రాజమౌళి ప్రతీది పర్ఫెక్ట్ గా ఉండాలని.

Advertisement
SS Rajamouli Expected To Next 3 Years To Complete His Upcoming With Mahesh Babu,

అలాగే భారీ తారాగణం, విదేశీ సాంకేతిక నిపుణులు కూడా తప్పకుండ ఉండేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు.ఈ సినిమా బడ్జెట్ కూడా అదే స్థాయిలో ఉండనుందని వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమా కోసం 500 నుండి 600 కోట్ల బడ్జెట్ ఉంటుంది అని టాక్ ఒకటి వినిపిస్తుంది.విజయేంద్ర ప్రసాద్ అందించిన పవర్ఫుల్ స్టోరీని రాజమౌళి పాన్ ఇండియాను మించేలా తెరకెక్కించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు.

ఈ సినిమాకు కూడా కీరవాణి సంగీతం అందించనున్నాడు.

Ss Rajamouli Expected To Next 3 Years To Complete His Upcoming With Mahesh Babu,

అయితే రాజమౌళి సినిమా అంటే ఏ హీరో అయినా సంవత్సరాల పాటు డేట్స్ ఇవ్వాల్సిందే.ప్రభాస్ బాహుబలి కోసం ఐదేళ్ల సమయం ఇవ్వగా.ట్రిపుల్ ఆర్ కోసం చరణ్, ఎన్టీఆర్ మూడేళ్లకు పైగానే సమయం కేటాయించారు.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

ఇక ఇప్పుడు మహేష్ కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు..

Advertisement

ఈ సినిమా వచ్చే ఏడాది మధ్యలో స్టార్ట్ అవ్వనుండగా.అప్పటి నుండి దాదాపు మూడేళ్ళ పాటు ఈయన డేట్స్ కేటాయించారని తెలుస్తుంది.

మరి ఇదే నిజం అయితే మహేష్ త్రివిక్రమ్ సినిమా తర్వాత మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద మూడేళ్ళ తర్వాతనే కనిపించనున్నారు.

తాజా వార్తలు