Sunishit: వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్న సునిశిత్ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

సునిశిత్.( Sunishit ) ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో ఈ పేరు కూడా ఒకటి.

ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఒక కాంట్రవర్సీతో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉన్నాడు సునిశిత్.మొన్నటికి మొన్న రామ్ చరణ్ భార్య ఉపాసనతో( Upasana ) లాంగ్ డ్రైవ్ చేశాను వెకేషన్ కు వెళ్లాను అంటూ నోటికి వచ్చిన విధంగా మాట్లాడడంతో చెర్రీ ఫ్యాన్స్ చేతిలో ఫుల్లుగా దెబ్బలు తిన్న విషయం తెలిసిందే.

మా వదిన గురించి అలా మాట్లాడతావా అంటూ కొట్టిన విషయం తెలిసిందే.అందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

కాగా సునిశిత్ పూర్తి పేరు సునిశిత్ శ్రీరామోజు.చాలావరకు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఇంటర్వ్యూలలో షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఈ మధ్యకాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో నిలుస్తున్నాడు.

Advertisement

నిజం చెప్పాలి అంటే సునిశిత్ కు సినిమా ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధం లేదు.కానీ తనకు సినిమా ఇండస్ట్రీలో అన్యాయం జరిగిందని తనకు రావాల్సిన అవకాశాలను రామ్ చరణ్, ఎన్టీఆర్,మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు తన్నుకుపోయారు అంటూ పిచ్చిపిచ్చిగా సంచలన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు.

అయితే మొదట్లో అతని మాటలు విన్న అభిమానులు ఎవడో పిచ్చి వాడు అనుకున్నారు.

కానీ సునిశిత్ మాటలు ఇంకా ఎక్కువ అవ్వడంతో ఇప్పటికే చేతులకు పని చెప్పాల్సి వచ్చింది.కొన్నాళ్ల క్రితం హీరోయిన్ లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi ) తాను ప్రేమించుకున్నామని ఆమె సినిమాల్లోకి వచ్చిన తర్వాత తనను వదిలేసిందని సునిషిత్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.అయితే సునిశిత్ కామెంట్స్ తో విసిగిపోయిన లావణ్య త్రిపాఠి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అరెస్టు కూడా చేశారు.

తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అతని మానసిక పరిస్థితి బాలేదని చెప్పి వదిలేశారు.అందరూ అనుకుంటున్నట్లుగా సునిశిత్ మానసిక పరిస్థితి బాగోలేదు అన్నమాట సంగతి పక్కన పెడితే అతని బ్యాగ్రౌండ్ మాత్రం మామూలుగా లేదు.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?

కాగా అతని బ్యాగ్రౌండ్ విషయానికి వస్తే.

Advertisement

సునిశిత్ పెద్ద పెద్ద చదువులు చదివాడని వరంగల్ లో పుట్టి పెరిగాడని అతని సన్నిహితులు చెబుతున్నారు.సునిశిత్ ఉస్మానియా యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ డ్రైవ్స్ అండ్ కంట్రోల్ లో మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్ చేసాడు.ఇక వరంగల్లోని వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో బీటెక్ చేశాడు.

అంతేకాక దాదాపుగా ఏడు ఇంటర్నేషనల్ జర్నల్స్ పబ్లిష్ చేయగా, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో మూడు పేపర్లు ప్రజెంట్ చేశాడు.అంతేకాదు సునిషిత్ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కి రివ్యూయర్ కూడా ఉన్నాడు.

ఇక చివరిగా ఆయన గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో త్రిబుల్ ఈ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేశారు.అయితే తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఇలా ఏదేదో మాట్లాడుతూ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ వివాదాస్పద వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

తాజా వార్తలు