శ్రీనువైట్ల ఆ పనిలో పడ్డాడు

‘బాద్‌షా’, ‘ఆగడు’, ‘బ్రూస్‌లీ’ చిత్రాల ఫ్లాప్‌లతో హ్యాట్రిక్‌ను దక్కించుకున్న శ్రీనువైట్లతో వర్క్‌ చేసేందుకు పెద్ద హీరోల నుండి చిన్న హీరోల వరకు అంతా కూడా భయ పడుతున్నారు.

ప్రస్తుతం శ్రీనువైట్ల ఫామ్‌ను పరిగణలోకి తీసుకుంటే కొత్తగా పరిచయం అవ్వాలని అనుకుంటున్న హీరోలు సైతం శ్రీనువైట్లతో చేయాలని అనుకోరు.

కాని ఏం చెప్పి ఒప్పించాడో కాని మెగా హీరో వరుణ్‌ తేజ్‌ను తాజాగా సి.కళ్యాణ్‌ ఒప్పించాడు.వరుణ్‌ తేజ్‌ మరియు శ్రీనువైట్లల కాంబినేషన్‌లో సినిమాకు కళ్యాణ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు.

వరుణ్‌ తేజ్‌కు ఈ సినిమాలో నటించేందుకు గాను భారీ పారితోషికం ఇవ్వడంతో పాటు, శ్రీనువైట్లకు అతి తక్కువ పారితోషికం ఇచ్చి కళ్యాణ్‌ ఈ సినిమాను కళ్యాణ్‌ నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది.టాలీవుడ్‌ నుండి అందుతున్న సమాచారం ప్రకారం దర్శకుడు శ్రీనువైట్లకు కేవలం కోటి రూపాయలు మాత్రమే ఇచ్చి వరుణ్‌ తేజ్‌తో సినిమాను నిర్మించబోతున్నాడు.

ఆ సినిమా సక్సెస్‌ అయితే శ్రీనువైట్లకు లాభాల్లో వాట లేదా మరో మూడు లేదా నాలుగు కోట్ల పారితోషికం ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం శ్రీనువైట్ల పక్కా కమర్షియల్‌ స్క్రిప్ట్‌ను రెడీ చేసే పనిలో ఉన్నాడు.

Advertisement

వచ్చే సంవత్సరం వేసవిలో వీరి సినిమా షురూ అయ్యే అవకాశాలున్నాయి.

Medium Range Heros: మార్కెట్ స్ట్రాటజీ తో అదరగొడుతున్న మీడియం రేంజ్ హీరోలు .. మాములు తెలివి కాదు
Advertisement