గ్రామాన్ని దత్తత తీసుకున్న పృథ్వీ.. శ్రీదేవి డ్రామా కంపెనీలో అరాచకం?

సాధారణంగా మనకు కరువు కాటకాలు వచ్చి, లేదా తీవ్ర వరదలు వస్తే కొన్ని ఊర్లు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటాయి.

ఈ క్రమంలోనే కొందరు గ్రామాన్ని వదిలి పట్టణాలకు వెళ్తుంటారు.

ఈ క్రమంలోనే కొందరు గ్రామాలను దత్తత తీసుకొని గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారు.ఈ విధంగా మనం నిజజీవితంలోనూ అలాగే సినిమాలలోను ఎన్నో చూసి ఉంటాము.

అయితే ఇదే కాన్సెప్టుతో మన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్ కూడా ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు.అయితే నిజంగానే గ్రామాన్ని దత్తత తీసుకొని గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నాడు అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్టే.

ఈయన గ్రామాన్ని దత్తత తీసుకుంది ఒక స్కిట్ లో భాగంగా మాత్రమే.ప్రతి ఆదివారం ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుందో మనకు తెలిసిందే.

Advertisement

ఈ కార్యక్రమంలో కమెడియన్లు చేసే కొన్ని స్కిట్ లు తీవ్ర వివాదాలకు కారణమవుతుంటాయి.తాజాగా ఈ షోలో నటుడు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్ గ్రామాన్ని దత్తత తీసుకునే కాన్సెప్టుతో సందడి చేశారు.

తాజాగా వచ్చే వారం జూలై 11న ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో నిర్వాహకులు విడుదల చేశారు.

హైపర్‌ ఆది, బుల్లెట్‌ భాస్కర్‌, గెటప్‌ శ్రీను, ఆటో రాంప్రసాద్‌ తదితరులంతా ఓకే గ్రామంలో నివసిస్తుంటారు.అయితే ఆ గ్రామం తీవ్ర కరువు కాటకాలను ఎదుర్కోవడంతో వీరందరూ ఆ ఊరిని వదిలి వెళ్లిపోవాలని అనుకుంటారు.అప్పుడే పృద్విరాజ్ సడన్ గా ఎంట్రీ ఇచ్చి.

"మీరు ఎవరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు.మీ గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటున్నాను" అని పృథ్వి రాజ్ మాట ఇస్తారు.

అక్కడ ఎన్నికలు పెడితే పూరీ జగన్నాథ్ సీఎం నేను హోం మినిష్టర్.. అలీ ఏమన్నారంటే?
డ్రై ఫ్రూట్స్ తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఈ క్రమంలోనే మీకున్న సమస్య ఏమిటో చెప్పండి అని అడగగా.అందుకు కమెడియన్ ఆది, శ్రీను చెప్పిన సిల్లీ సమస్యలు నవ్వులు పంచాయి.

Advertisement

ఒకే ఊరిలో ఉండే గెటప్ శ్రీను, రోహిణి మధ్య సాగిన కామెడీ పంచ్‌లు, భాస్కర్‌ జోకులు పొట్ట చెక్కలయ్యేలా ఉన్నాయి.మరి ఈ కమెడియన్లు శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికపై చేసిన హంగామా పూర్తి చూడాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.

తాజా వార్తలు