Arudra ,Sri Sri : ఇద్దరు గొప్ప లెజెండ్స్ మధ్య మరో రచయిత్రి చిచ్చు పెట్టిందా ?

రచయిత రామలక్ష్మి( Author Ramalakshmi ) అంటే ఎంత మంది గుర్తు పడతారో లేదో తెలియదు కానీ కవి ఆరుద్ర( Arudra ) భార్య రామలక్ష్మి అంటే యిట్టె గుర్తు పట్టేస్తారు.

రామలక్ష్మి ని ఈ జెనరేషన్ వాళ్ళు పెద్దగా ఫాలో అవుతున్నారో లేదో కానీ ఆమె మంచి రచయిత్రి, అలాగే సామజిక వేత్త.

ఏది అనుకుంటే అది మొహం మీద చెప్తుంది.కొన్నేళ్ల క్రితం ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చి చాల మంది సెలెబ్రిటీ ల జీవితాల్లో ఉన్న రహస్యాలను బయట పెట్టింది.

అయితే ఒక్కోసారి నిజం చెప్పేవాడు లోక విరోధి .ఇది రామలక్ష్మి విషయంలో నిజం.ఆమె వల్ల ఇద్దరు రచయితలు విడిపోయి చాల ఏళ్ళు దూరంగా ఉన్నారు.

అయితే ఇందులో ఎవరి తప్పు లేదు కానీ ఆ సంఘటన వల్ల చాల ఇబ్బందులు మాత్రం జరిగాయి.

Advertisement

అప్పట్లో వాణిశ్రీ, గిరీష్ కర్నాడ్, స్మిత పాటిల్ లాంటి వారు నటించిన అనుగ్రహం సినిమా శ్యామ్ బెనెగల్ తెరకెక్కించారు.అయితే ఈ సినిమాకు డైలాగ్స్ తో పాటు పాటలు తెలుగులో రాసేందుకు శ్రీశ్రీ ( Sri Sri )తో ఒప్పందం కుదిరింది.అయితే తాను చెన్నై కి వెళ్లాల్సిన పని ఉంది వచ్చాక రాసి పెడతాను అని చెప్పి శ్రీశ్రీ చాల గ్యాప్ ఇచ్చేసారు.

అయన కోసం కొన్నాళ్ళు వేచి చుసిన చిత్ర బృందం ఆరుద్ర సహాయం తో అనుగ్రహం సినిమా ను పూర్తి చేసారు.దాంతో శ్రీశ్రీ కి కోపం వచ్చింది.

అప్పటికి కొన్ని విషయాల్లో ఆరుద్ర పై కోపం గా ఉన్న శ్రీశ్రీ ఈ సందర్భాన్ని కూడా మరింత వేడి పెంచారు.పైగా రామలక్ష్మి ఆరుద్ర భార్య అయ్యాకే తమ మధ్య గ్యాప్ వచ్చింది అని కూడా అనేవారట.ఒకానొక సందర్భం లో రామలక్ష్మిని తాటకి తో కూడా పోల్చారట.

కానీ ఆమె శ్రీశ్రీ ఆలస్యం వల్లనే శ్యామ్ గారు ( Mr.Shyam )ఆరుద్ర కు సినిమా ఇచ్చారు తప్ప పర్సనల్ గా ఏమి లేదు అని చెప్పే ప్రయత్నం చేసిన చాల ఏళ్ళ పాటు శ్రీశ్రీ ఆరుద్ర మాట్లాడుకోలేదు.పైగా బాహాటంగా తగవు కూడా జరిగింది.

Cool Bet Im Überblick : Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten
సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు

ఇది అప్పట్లో ఒక సంచలనం.ఆ తర్వాత ఇలాంటి సినిమాలు తీయను అంటూ శ్యామ్ బెనెగల్ ఒట్టు పెట్టుకునే వరకు వెళ్ళింది వ్యవహారం.

Advertisement

తాజా వార్తలు