భారత్ పై కీలక వ్యాఖ్యలు చేసిన శ్రీలంక

శ్రీలంక దేశ ఎన్నికల్లో రాజపక్స బ్రదర్స్ ఘన విజయాన్ని సాధించారు.ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వం భారత్ పై కీలక వ్యాఖ్యలు చేసింది.

భారత్ కు అత్యంత మిత్ర దేశాల్లో ఒకటైన శ్రీలంక కొన్నేళ్ల కిందట చైనా గూటికి చేరిన విషయం అందరికీ తెలిసిందే.ఆర్థిక ప్రయోజనాల కోసం ఆశ చూపుతూ చైనా.

భారత్ చుట్టుపక్కల దేశాలైన భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంకను తన వైపు తిప్పుకుంది.మిత్ర దేశాలను తన సైడ్ కు తిప్పుకుని భారత్ కు ఉచ్చు బిగించేందుకు ప్లాన్ వేస్తోంది.

అయితే కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా చైనాకు వ్యతిరేకత నెలకొంది.శ్రీలంకలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజపక్స సోదరులు భారీ విజయంతో గెలుపొందారు.

Advertisement

గతంలో మహీంద రాజపక్స చైనా కు అనుకూలంగా వ్యవహరించగా.ఎన్నికలకు ముందు ఆయన ఢిల్లీకి వచ్చారు.

ఈ సమావేశంలో శ్రీలంక కొత్త ప్రభుత్వం భారత్ కు భరోసా కలిగేలా కీలక వ్యాఖ్యలు చేసింది.భారత్ కు తొలి ప్రాధాన్యత దక్కేలా నూతన విదేశాంగ విధానాన్ని తీసుకొచ్చామని శ్రీలంక విదేశాంగ కార్యదర్శి జయంత్ కొలంబగే వెల్లడించాడు.

భవిష్యత్ లో భారత వ్యూహాత్మక భద్రతకు హాని కలిగించేలా ప్రయత్నాలు చేయమని ఆయన పేర్కొన్నాడు.భారత వ్యతిరేక కార్యకలాపాలకు తమ భూభాగాన్ని వినియోగించుకోమని, చైనాతో హంబన్ టోట ఒప్పందం కుదుర్చుకోవడం శ్రీలంక చేసిన తప్పని ఆయన పేర్కొన్నాడు.

వీడియో: ట్రైన్ బోగీ మెట్లపై కూర్చున్న వ్యక్తి.. జారిపోవడంతో..?
Advertisement

తాజా వార్తలు