టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న వారిలో ప్రథముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఈయన నటనలో ఎంత ప్రతిభావంతుడో… తన లైఫ్ లో ఎంతో క్రమశిక్షణను కాలకేగి ఉండేవాడు.
అప్పట్లో ఉన్న నటీనటీలు కావొచ్చు… ఆ తర్వాత వచ్చిన నటీనటులకు కావొచ్చు ఎన్టీఆర్ ఈ విషయాన్ని చెబుతూ ఉండేవారు.నటుడు ఎంతటివారైనా కావొచ్చు షూటింగ్ సమయానికి రాకపోతే ఆ రోజు షెడ్యూల్ అంతా వేస్ట్ అవుతుంది అని చెప్పేవారు.
దీని వలన మనకు డబ్బులు పెట్టే నిర్మాత నష్టాల పాలవుతాడని అర్థమయ్యేలా చెప్పేవాడట.
ఇలా ఎన్టీఆర్ చెప్పిన మాటలను విని మంచి బాటలో నడిచిన ఎందరో ప్రేక్షకులు మెచ్చిన నటులుగా మారి మంచి స్థాయిలో ఉన్నారు.
అలాంటి వారిలో రజినీకాంత్, చిరంజీవి లు ఉన్నారు.అలా అంబదరూ ఈయనను చూసి నేర్చుకుని గొప్ప వారయినవారే కానీ ఇతనికి పోటీగా నిలిచినా వారు లేరు.కానీ ఒక్క హీరోయిన్ మాత్రం ఎన్టీఆర్ కు పోటీగా వచ్చింది.ఆమె మరెవరో కాదు అలనాటి హీరోయిన్ భానుమతి.
ఎన్టీఆర్ క్రమశిక్షణకు మరు పేరుగా ఉంటే… భానుమతి అయితే అంతకు మించి అన్నట్లుగా క్రమశిక్షణలో ఎన్టీఆర్ ను మించిపోయింది అట.ఈమె షూటింగ్ జరిగే స్పాట్ కు కరెక్ట్ గా రావడమే కాకుండా… తాను నటనలో ఉపయోగించే మేక్ అప్ కిట్ ను వాడడంలోనూ చాలా పద్దతిగా మరియు ఎన్నో జాగ్రత్తలు ఉంటుందట.దీనికి కూడా ఒక కారణం ఉందట.నేటి కాలంలో అయితే ఆన్ లైన్ లో వందల రకాల మేక్ అప్ కిట్ లు అందుబాటులో ఉన్నాయి.క్షణాలలో ఏవి కావాలన్నా కొనుక్కోవచ్చు.

కానీ గతంలో ఇప్పుడున్న విధముగా అందుబాటులో ఉండేవి కాదు.పైగా ఒక మేక్ అప్ కిట్ కావాలన్నా ఎదురుచూసే విధంగా ఉండేది.ఈ కారణంగానే అప్పుడు చిన్న తరహా నటీనటులకు మేక్ అప్ ఎక్కువగా వేసేవారు కాదట.
ఏదో వేశాము అంటే వేశాము అన్నట్లుగా మేక్ అప్ వేసి నటింపచేసేవారట.అందుకే ఇలాంటి కష్టాలు అన్నీ తెలుసుకున్న భానుమతి మేక్ అప్ కిట్ ను సమకూర్చుకునే దానిలో చాలా జాగ్రత్తగా ఉండేదట.
అందుకే నీట్ గా పాత్రకు తగిన విధంగా మేక్ అప్ వేసుకుని తన ఆ రోజు షెడ్యూల్ పూర్తి అయ్యే వరకు అది పోకుండా చూసుకునేవారట.

ఇక షూటింగ్ లో ఉన్నప్పుడు మధ్యాహ్నం భోజనం కూడా చాలా మంది లాగా సెట్ లో ప్రొడక్షన్ టీం ఏర్పాటు చేసిన భోజనాన్ని తీసుకునేవారు కాదట.ఇంటి నుండి తెప్పించుకున్న భోజనాన్ని మాత్రమే తినేవారట.ఇలా తాను ఆరోగ్యం పట్ల అంత జాగ్రత్త తీసుకునేవారు భానుమతి.
ఒకవేళ ఎక్కడైనా బయట ఊర్లలో షూటింగ్ అయితే, దగ్గర్లోనే సత్రాలలో భోజనం చేయడానికి ఇష్టపడేవారట.దీని వలన పుణ్యం మరియు డబ్బు ఆదా అవుతుందని ఆమె ఆలోచన.
ఇలా భానుమతి పాటించిన చాలా పద్దతులను ఎన్టీఆర్ కూడా నచ్చి మెచ్చి కొంతకాలం వరకు ఆచరణలో పెట్టారట.అందులో భాగంగానే అడవిరాముడు షూటింగ్ సమయంలో దగ్గర్లోనే దేవాలయాల్లో భుజించారట ఎన్టీఆర్.
ఆ విధంగా ఎన్టీఆర్ లాంటి వ్యక్తి భానుమతిని ఫాలో అయ్యారు.







