కేర‌ళ ఆగ్నేయ అరేబియాలో బ‌ల‌ప‌డిన నైరుతి రుతుప‌వ‌నాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక.. !

దేశంలో కరోనా ముప్పు తప్పనే లేదు.ఇప్పటికి కూడా అక్కడక్కడ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.

ఇక వేసవి కాలం సీజన్ కూడా అయిపోయింది.ఈ వేసవిలో ఎండలు ఎంతలా దంచికొట్టాయో కోవిడ్ కూడా తీవ్రస్దాయిలో ప్రజలను ఒక ఆటాడుకుంది.

South West Monsoon Prevails In South East Arabia Of Kerala , South West Monsoon,

కానీ వేసవిలో కురిసిన వర్షాల వల్ల అంతలా వేడి అనిపించలేదు.ఈలోపల వర్షాకాలం కూడా వచ్చేసింది.

ఇప్పటికే జల్లులు కూడా మొదలైయ్యాయి.ఇకపోతే సాధార‌ణంగా నైరుతి రుతుప‌వ‌నాలు జూన్ 1 న కేర‌ళ‌ను తాకుతాయి.

Advertisement

కానీ ఈ సారి రెండు రోజుల ఆల‌స్యంగా కేర‌ళను తాకాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌క‌టించింది.ఇలా ప్రవేశించిన నైరుతి రుతుప‌వ‌నాలు కేర‌ళ తీరం ఆగ్నేయ అరేబియాలో బ‌ల‌ప‌డ్డాయ‌ని, ఇందువల్ల కేర‌ళ‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని ఐఎండీ ప్ర‌క‌టించింది.

కాగా దీని ప్రభావంతో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌తో పాటు ప‌లు రాష్ట్రాల్లోనూ ఉరుములు, మెరుపుల‌తో కూడిన‌ భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.అంతే కాకుండా జూన్ 8 నుంచి 10 వ‌ర‌కు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారీ వ‌ర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.

ఇక ఈ వర్షాకాలం రైతులను సుభిక్షంగా ఉంచుతుందో లేక నష్టాలపాలు చేస్తుందో ఈ సీజన్ గడిస్తే గానీ తెలియదు.

హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం ఇంట్లోనే ఇలా ఈజీగా ఫేషియ‌ల్ చేసుకోండి!
Advertisement

తాజా వార్తలు