ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుందని తెలుస్తోంది.ఈ మేరకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ( DSC Notification )కి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.
టీచర్ల నియామకాలపై దృష్టి సారించిన ప్రభుత్వం వారం రోజుల్లో ఆరు వేల నుంచి పది వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్( DSC Notification విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.దీనిపై ఇప్పటికి మంత్రి బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ) విద్యాశాఖ ఉన్నతాధికారులతో డీఎస్పీపై కీలక సమావేశం నిర్వహించారు.ఇందులో భాగంగా జిల్లాల వారీగా ఉన్న ఖాళీల వివరాలను తెలుసుకున్నారు.
విద్యాశాఖలో 18,500 పోస్టులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారని తెలుస్తోంది.