బాహుబలి2 సినిమాను సోనూసూద్ రిజెక్ట్ చేశారా.. ఆ పాత్రను వదులుకున్నారా?

ప్రభాస్ హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన బాహుబలి2 బాక్సాఫీస్ వద్ద కనీవిని ఎరుగని స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో చిన్న పాత్రలో నటించిన నటీనటులకు సైతం మంచి పేరు వచ్చింది.

రాజమౌళి భారీ బడ్జెట్ తో బాహుబలి2 సినిమాను తెరకెక్కించగా పెట్టుబడితో పోల్చి చూస్తే నిర్మాతలకు ఈ సినిమా ద్వారా ఊహించని స్థాయిలో లాభాలు దక్కాయి.భారీ మొత్తం ఖర్చు చేసి హక్కులు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా కళ్లు చెదిరే లాభాలను అందించింది.

అయితే బాహుబలి2 సినిమాలోని కీలక పాత్రకు సోనూసూద్ ను ఎంపిక చేయగా ఆయన ఆ పాత్రను వదులుకున్నారని సమాచారం.సోనూసూద్ మాట్లాడుతూ ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

డేట్స్ సమస్య వల్ల ఈ సినిమాలో నటించే అవకాశాన్ని తాను వదులుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు.అయితే ఏ పాత్రను వదులుకున్నాననే విషయాన్ని మాత్రం సోనూసూద్ వెల్లడించకపోవడం గమనార్హం.

Advertisement

సుబ్బరాజు లేదా అడివి శేష్ పోషించిన పాత్రను జక్కన్న సోనూసూద్ కు ఆఫర్ చేసి ఉండవచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

రాజమౌళి భవిష్యత్తు ఇంటర్వ్యూలలో సోనూసూద్ రిజెక్ట్ చేసిన రోల్ గురించి క్లారిటీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.ఎక్కువరోజులు వర్కింగ్ డేట్లు కావాలని జక్కన్న కోరడం వల్లే సోనూసూద్ ఈ పాత్రను వదులుకున్నారని సమాచారం అందుతోంది.

మరోవైపు లాక్ డౌన్ సమయంలో చేసిన మంచి పనుల వల్ల సోనూసూద్ కు ప్రేక్షకుల్లో పాజిటివ్ ఇమేజ్ వచ్చింది.సోనూసూద్ కు దర్శకనిర్మాతలు సైతం పాజిటివ్ రోల్స్ ను ఆఫర్ చేస్తున్నారని తెలుస్తోంది.సోనూసూద్ కు తెలుగులో ఆఫర్లు తగ్గినా ఇతర భాషల్లో మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.

సోనూసూద్ కు సోషల్ మీడియాలో భారీస్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు.

సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు
Advertisement