సోనూసూద్( Sonu Sood ).ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
కరోనా టైమ్ లో స్టార్ట్ చేసి.ఇప్పటికీ సమాజ సేవ చేస్తూనే ఉన్నాడు బాలీవుడ్, టాలీవుడ్ ( Bollywood, Tollywood )రీల్ విలన్, రియల్ హీరో సోనూసూద్.
ఎందరో జీవితాల్లో ఆయన వెలుగు నింపారు.చదువుకోవాలి అనుకున్న వారిని ఎంత వరకైనా చదివిస్తా అన్నారు.
సత్తా ఉండి సపాదన లేని వారికఉపాధి కల్పించారు.ఇలా చెప్పుకుంటూ వెళ్తే.
సోనూసూద్ చేసిన సాయానికి గుళ్ళు కట్టేశారు దేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకు గుడి ఉంది అంటే సోనూసూద్ ఎంత మంచి వాడు కాకపోతేగుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు.
అప్పులు చేసి, ఆస్తులు తాకట్టు పెట్టి మరీ ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచాడు.తెరపై విలన్ గా కనిపించినా నిజజీవితంలో హీరోనని చాటుకున్నారు.ఆయన సేవలు అందుకున్న వారు వివిధ రకాలుగా తమ కృతజ్ఞత చాటుకుంటున్నారు.
తాజాగా ఖమ్మంలో( Khammam ) ఒక మహిళ సోనూ సూద్ పేరుతో కూరగాయల షాప్ ను స్టార్ట్ చేసింది.ఆ దుకాణంలో కూరగాయలు కొన్న వారు షాపు ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.
ఈ ఫొటో వైరల్ గా మారి సోనూ సూద్ వరకూ చేరింది.
దీంతో ఆయన ఈ ఫొటోను రీట్వీట్ చేస్తూ.ఇప్పుడు నాకు కూరగాయల షాప్ కూడా ఉందంటూ నవ్వుతు కామెంట్ పెట్టారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
నెటిజన్లు తమ కామెంట్లలో ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.