జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు స్పందించారు.జనసేన, టీడీపీ పొత్తుపై పవన్ ఎక్కడా మాట్లాడలేదని చెప్పారు.
బీజేపీ పొత్తుపైనే పవన్ మాట్లాడారని తెలిపారు.టీడీపీతో పొత్తుపై జనసేన పార్టీ క్లారిటీ ఇచ్చాక తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని సోమువీర్రాజు వెల్లడించారు.







