'సోలో బ్రతుకే సో బెటర్' ను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేయనున్న జీ తెలుగు

ఎప్పుడూ తన అభిమానులకు దగ్గరగా ఉండే జీ తెలుగు ప్రేమికులకు ఎంతో ఇష్టమైన ఫిబ్రవరి లో తన ప్రేమను తనకి ఇష్టమైన ప్రేక్షకులపై కురిపించకుండా ఉంటుందా? అందుకే ఈ ఆదివారం మరో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తో మన ముందుకు వస్తుంది జీ తెలుగు.ప్రేమకు ఒక కొత్త అర్ధాన్ని చెప్పిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే సినిమాతో ఈ ఆదివారం అంటే 21 ఫిబ్రవరి సాయంత్రం 5:30 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి లలో ప్రసారం చేయనుంది.

 Solo Brathuke So Better World Television Premiere-zee Telugu, Solo Brathuke So B-TeluguStop.com

యూత్‌ఫుల్ ఎంటర్టైన్మెంట్ తెరకెక్కించిన దర్శకుడు సుబ్బు కథ విషయానికి వస్తే.విరాట్ (సాయి ధరమ్ తేజ్) ఇంజనీరింగ్ చదువుతూ ప్రేమ, పెళ్లి, ఫ్యామిలీ ఎమోషన్స్‌‌కి అస్సలు విలువ ఇవ్వడు.

అసలు పెళ్లే వద్దంటూ.‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటూ ఓ పుస్తకాన్ని రాయడమే కాకుండా పెళ్లి వద్దంటూ ఉపన్యాసాలు ఇస్తుంటాడు.

కాలేజ్‌లో ఉద్యమాన్ని లేవనెత్తి ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఆర్గనైజేషన్ కి ఫౌండర్ అవుతాడు.తన మామ (రావు రమేష్) ఇతన్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు.

జీవితంలో పెళ్లే చేసుకోను అని డిసైడ్ అయిన కొంతమంది స్నేహితులతో కలిసి వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్లిన విరాట్‌కి అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి.స్నేహితులు ఒక్కొక్కరు పెళ్లి చేసుకుని దూరం అవుతారు.

విరాట్ ఒంటరిగా మిగిలిపోతాడు.ఆ టైంలో విరాట్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అమృత (నభా నటేష్) విరాట్ జీవితంలోకి ఎలా వచ్చింది? అన్నదే మిగిలిన కథ.

థమన్ మరోసారి తన మ్యూజిక్‌తో ఆకట్టుకోగా, వెంకట్ దిలీప్ సినిమాటోగ్రఫీ అందరిని మంత్రముగ్ధుల్ని చేసింది.సో మిస్ అవ్వకుండా ఫిబ్రవరి 21 న సాయంత్రం 5:30 గంటలకు ‘సోలో బ్రతుకే సో బెట్టర్’ ను చూడండి మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డీ ఛానళ్లలో.డోంట్‌ మిస్‌ ఇట్‌.ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగుని సబ్ స్క్రైబ్ చేసుకోండి.జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube