సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న రూ. 30 లక్షల ప్యాకేజీ సాఫ్ట్ వేర్ ఉద్యోగి..!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయితీ ఎలక్షన్స్  జరుగుతున్న సంగతి అందరికి తెలిసిన విషయమే.ఈ తరుణంలో ఎలక్షన్  లలో భాగంగా విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

కొన్ని ప్రాంతాలలో ఏకగ్రీవంగా సర్పంచులను ఎన్నుకుంటూ ఉంటే.మరికొన్ని ప్రాంతాలలో నామినేషన్లు వేసి ఎన్నికలను నిర్వహిస్తూ ఉన్నారు ఎలక్షన్ అధికారులు.

ఆ ఎన్నికలు రాజకీయ నేతల మధ్య కాకుండా సామాన్య ప్రజలు నుండి సంచలన వార్తలు వస్తున్నాయి.ఇంతకీ ఏం జరిగింది అని అనుకుంటున్నారా.?

సంవత్సరానికి 30 లక్షల జీతం వచ్చే ఒక యువకుడు ఊరి తరపున సర్పంచ్ పదవికి నామినేషన్ వేశాడు.ఇలా ఎందుకు చేశావ్.? అని ఎవరైనా అడిగితే ప్రజలకు ఎంతో కొంత ఉపయోగపడాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ వ్యక్తి చెప్పుకొస్తున్నాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

Advertisement

గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్ల గుంట గ్రామానికి చెందిన సతీష్ బాబు అనే యువకుడు బెంగళూరు నగరంలో ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో విధులు నిర్వహిస్తూ ఉన్నాడు.సతీష్ బాబు కు నెలకు రెండున్నర లక్షల జీతం వస్తుంది.

అంటే సంవత్సరానికి 30 లక్షలన్నమాట.ఫుల్ లగ్జరీ లైఫ్, ఎటువంటి ఆలోచనలు లేకుండా సాఫీగా కొనసాగే జీవితం, అలాగే ఎంతో సంతోషంగా జీవించుకునే అంత సంపద, బిజీ లైఫ్ లో ఉన్న అతడు తన ఊరి ప్రజల కోసం ఎంతో కొంత సహాయపడాలని ముందుండి నడిపించాలని ఒక నాయకుడిగా నిలబడాలని సర్పంచ్ పదవి కోసం నామినేషన్ వేశాడు.

కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా దాదాపు అన్ని ప్రముఖ సంస్థలు వర్క్ ఫ్రొం హోమ్ విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి అందరికి తెలిసిందే.ఈ తరుణంలోనే ఇంటి వద్దనే ఉంటూ విధులు నిర్వహిస్తున్న సతీష్ బాబు తన ఊరి పరిస్థితి గురించి ఆలోచిస్తూ ఊరికి కాస్త మేలు చేకూర్చలన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సతీష్ బాబు పేర్కొన్నాడు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు