బాలయ్య మార్కు డైలాగ్.. పరాకాష్ట కు చేరిన సోషల్ మీడియా

సోషల్ మీడియా వ్యాప్తి విపరీతంగా పెరిగిన ఉన్న నేటి రోజుల్లో ఏది మాట్లాడిన కూడా పెద్ద భుతుగా మారిపోతుంది.తాజాగా బాలకృష్ణ వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో మాటల్లో మాటగా అక్కినేని తొక్కినేని అంటూ ఒక పదం వాడాడు.

 Social Media Reaction On Balayya Dialogue On Akkineni Controversy Details, Balay-TeluguStop.com

దాంతో ఖేల్ ఖతం… బాల కృష్ణ ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తున్న వాళ్లకు ఒక వరం లా కనిపించింది.బ్లడ్ బ్రీడ్ అంటూ గతం లో బాలయ్య బాబు మాట్లాడిన మాటలను వైరల్ చేస్తున్నారు.

అప్పుడు మీ బ్లడ్ బ్రీడ్ అన్న నోరు ఇప్పుడు ఇలాంటి మాటలను ఎలా మాట్లాడ గలుగుతుంది అంటూ మీడియాలో ఏకి పారేస్తున్నారు.ఇలా బాలకృష్ణ ను ట్రోల్ చేస్తున్న వారిలో కొందరు రాజకీయ ప్రత్యర్ధులు అయితే.

మరి కొందరు అక్కినేని అభిమానులు.మా అక్కినేని ఫ్యామిలీ అందరినీ బాలకృష్ణ అవమానించాడు అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇక చెప్పచ్చే అస్సలు విషయం ఏమిటి అంటే బాలయ్య స్పీచ్ విన్నాక అక్కడ తను ఎవరిని అనాలని అనలేదని చాలా క్లియర్ గా అర్థం అవుతుంది.

Telugu Akkineni Fans, Balakrishna, Balayya, Breed-Movie

తనకు తన టీం మెంబెర్స్ తో ఉన్న సంబంధాలను చెప్తూ పాత విషయాలను గుర్తు చేసుకున్నాం అని చెప్ప ప్రయత్నం చేశాడు.దాంట్లో నిజంగా తప్పు ఉంది అని అనుకోవడం పూర్తిగా పొరపాటే.సోషల్ మీడియా ఏది మాట్లాడిన తప్పు పడుతుంది అని మరో మారు నిజం అయ్యింది.

ఇలా ప్రతి విషయం వైరల్ అవుతుంటే ఎటు పోతుందో మన సమాజం అని కాస్త బాధ కలుగుతుంది.

Telugu Akkineni Fans, Balakrishna, Balayya, Breed-Movie

ఆ మాత్రం తెలియదా, బాలయ్యకు సంస్కారం లేదా ? అక్కినేని ఫ్యామిలీ అంటే బాలయ్యకు ఇష్టం ఉండదు అంటే ఏమైనా అర్దం ఉందా ? ఆయన ఏదో రైమ్ కోసం చెప్పిన మాట పట్టుకొని ఇంత రాద్దాంతం అవసరమా ? ఇక ఇప్పటికైనా ఈ వ్యాఖ్యలను గతం లో వచ్చిన బ్లడ్ బ్రీడ్, అమ్మాయి కడుపు లాగా కొన్ని రోజులు మాట్లాడుకొని వదిలెయ్యండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube