Sobhan Babu: ఆ స్టార్ హీరో డబ్బు అందితే మాత్రమే సినిమా షూటింగ్ కు వచ్చేవారట.. ఏం జరిగిందంటే?

సినిమా అనేది రంగుల ప్రపంచం.ఈ రంగుల ప్రపంచంలోకి ఎంతోమంది హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, నిర్మాతలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు,విలన్లు ఇలా ఎంతోమంది వస్తుంటారు.

అందులో కొందరు సినిమా బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తే మరి కొందరు ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి రానిస్తుంటారు.కొంతమంది సినిమాలపై ఉన్న పిచ్చి ఫ్యాషన్ తో సినిమా ఇండస్ట్రీకి( Cinema Industry ) ఎంట్రీ ఇస్తే మరి కొందరు బాగా డబ్బులు సంపాదించాలి అని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు.

ఒక్కొక్క కోరికతో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు.అయితే సినిమా ఇండస్ట్రీలో కొందరు డబ్బు విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటారు.

అలాంటి వారిలో ఒకప్పటి హీరో శోభన్‌బాబు( Sobhan Babu ) కూడా ఒకరు.కెరిర్ తొలినాళ్ళలో శోభన్‌బాబు కూడా డబ్బుకు ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి.

Advertisement
Sobhan Babu Interest In Remuneration-Sobhan Babu: ఆ స్టార్ హీ

అతను హీరోగా నిలదొక్కుకున్న తర్వాత రెమ్యునరేషన్‌ విషయంలో ఎంతో కఠినంగా వ్యవహరించేవారని చెప్పుకునేవారు.డబ్బు చేతిలో పడితేనేగానీ షూటింగ్‌కి( Shooting ) వచ్చేవారు కాదనే మాట ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది.

నిర్మాత ఇస్తానన్న డబ్బు సమయానికి అందకపోవడం వల్ల షూటింగ్‌కి వెళ్ళని సందర్భాలు కూడా శోభన్‌బాబు కెరీర్‌లో ఉన్నాయట.అయితే ఆయన డబ్బు విషయంలో అంత ఖచ్చితంగా ఉండడానికి గల కారణం ఏమిటనే విషయం గురించి కొందరు సీనియర్‌ నటుల దగ్గర ప్రస్తావించినపుడు.

Sobhan Babu Interest In Remuneration

దానికి వారు చెప్పిన సమాధానం వింటే ఆశ్చర్యం కలగక మానదు.మరి ఇంతకీ ఆశ్చర్య కలిగించే ఆ విషయం ఏమిటి అన్న విషయానికి వస్తే.శోభన్‌బాబు తన కెరీర్‌ స్టార్ట్‌ చేసిన దగ్గర నుంచి సంపాదించిన ప్రతి రూపాయిని భూమిపైనే పెట్టేవారనే విషయం చాలా మందికి తెలుసు.

అలా ఎంతో భూమిని( Land ) ఆయన కొనుగోలు చేశారు.దానికి కూడా ఒక లెక్క ఉండేది.శోభన్‌బాబు ఒక సినిమా ఒప్పుకున్నారంటే.దానికి ఎంత రెమ్యునరేషన్‌( Remuneration ) వస్తుంది, దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్‌ చెయ్యాలి,

Sobhan Babu Interest In Remuneration
పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

ఎప్పుడెప్పుడు ఎంతెంత కట్టాలి అనే విషయాలని ఒక నోట్‌బుక్‌లో రాసుకునేవారు.షూటింగ్‌కి కూడా ఆ నోట్‌బుక్‌ తెచ్చుకునేవారు.షాట్‌ బ్రేక్‌లో తను రాసుకున్న వివరాలను పదే పదే చూసుకునేవారు.

Advertisement

ఒక సినిమాకి సంబంధించి తనకు రావాల్సిన రెమ్యునరేషన్‌ అనుకున్న టైమ్‌కి, అనుకున్నంత వస్తేనే షెడ్యూల్‌ ప్రకారం తను కొన్న భూమికి డబ్బు చెల్లించగలుగుతారు.అందుకే ఆ విషయంలో ఎంతో ఖచ్చితంగా ఉండేవారు.

ఎవరేమనుకున్నా సరే.తన పద్ధతిని మాత్రం చివరి వరకు మార్చుకోలేదు.అందుకే డబ్బు అందితేనే శోభన్‌బాబు షూటింగ్‌కి వస్తాడనే ప్రచారం అప్పట్లో బాగా జరిగింది.

తాజా వార్తలు