ఎన్టీఆర్ అలా చేస్తే స్త్రీ జాతిని కించపరిచినట్టు కాదు.. బన్నీ మామ షాకింగ్ కామెంట్స్ వైరల్!

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా అల్లు అర్జున్‌( Allu Arjun ) మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి ( Kancharla Chandrasekhar Reddy )అలాగే పవన్‌ కల్యాణ్‌,, అల్లు అర్జున్‌ తరచూ చేస్తున్న వ్యాఖ్యలతో మెగా ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.

ఈ వార్తలు చాలా సార్లు సోషల్ మీడియాలో వినిపించినప్పటికీ అటు అల్లు ఫ్యామిలీ కానీ ఇటు మెగా ఫ్యామిలీ ( Mega Family )కానీ స్పందించలేదు.

అయితే తాజాగా అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి మొదటిసారి ఈ విషయంపై స్పందించారు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Smuggling Is Really Wrong, Smuggling, Wrong, Tollywood, Ntr, Chandra Shekar Redd

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పవన్ కల్యాణ్‌ ( Pawan Kalyan )గారు ఏ సందర్భంలో అలా మాట్లాడారో తెలియదు.ఆయన మాట వరసకు అలా అని ఉంటారు అని నేను అనుకుంటున్నాను.

కానీ ప్రజల్లోకి తప్పుడు సందేశం పోతోంది.తర్వాతైనా ఆయన నా ఉద్దేశం ఇది అని చెబితే బాగుండేది.

Advertisement
Smuggling Is Really Wrong, Smuggling, Wrong, Tollywood, Ntr, Chandra Shekar Redd

ఆయనే స్వయంగా పూనుకొని సరిదిద్దితే బాగుండేదని నా అభిప్రాయం అని ఆయన తెలిపారు.అలాగే ఎన్టీఆర్‌ ( NTR )నటుడిగా రావణుడు, దుర్యోధనుడి పాత్రలు పోషించారు.

అంటే దానర్థం మొత్తం స్త్రీ జాతిని ఆయన కించపరిచాడని కాదు కదా.ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యారు.పవన్‌ కల్యాణ్‌ కూడా నటుడిగా ఉండి రాజకీయ నాయకుడు అయ్యారు.

సినిమా యాక్టర్‌ను యాక్టర్‌ గానే చూడాలి.వారి వ్యక్తిత్వాలకు ఆ పాత్రల స్వభావాన్ని అంటగట్టే ప్రయత్నం చేయకూడదు.

Smuggling Is Really Wrong, Smuggling, Wrong, Tollywood, Ntr, Chandra Shekar Redd

అల్లు అర్జున్‌ నిజంగా స్మగ్లింగ్‌ చేస్తే తప్పు పట్టాలి అని ఆయన తెలిపారు.అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్‌ వచ్చింది.69 ఏళ్లలో ఎవరికీ రాని అవార్డ్‌ ఆయన్ను వరించింది.ఆయన మిత్రపక్షం బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

ఎన్డీయే ప్రభుత్వమే అర్జున్‌కు ఉత్తమ నటుడు అవార్డ్‌ ఇచ్చింది.అది పవన్‌ కల్యాణ్‌కు తెలియదా? మంచీ చెడూ చూడకుండానే భారత ప్రభుత్వం ఆ పురస్కారాన్ని ఇవ్వలేదు కదా? ఆయన అభిమానులేమో అల్లు అర్జున్‌ నే అన్నాడు అని అనుకుంటున్నారు.ఇప్పుడు ఈ వివాదానికి శుభం కార్డు పడాలంటే ఇది నేను జనరల్‌గా అన్నాను అని పవన్‌ కల్యాణ్‌ చెప్పాలి.

Advertisement

లేదంటే ఆయన భాగస్వామిగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వాన్ని తప్పు పట్టినట్లే.భారత ప్రభుత్వ నిర్ణయాన్ని వివాదాస్పదం చేస్తున్నట్లుగానే భావించాలి.చిరంజీవి గారు పవన్‌ కల్యాణ్‌, అల్లు అర్జున్‌తో మాట్లాడి ఈ వివాదానికి ముగింపు పలకాలి అని తెలిపారు చంద్రశేఖర్ రెడ్డి.

అయితే ఆయన చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అల్లు అర్జున్ అభిమానులు మద్దతుగా స్పందిస్తుండగా మెగా అభిమానులు నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు