కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్కృతి ఇరానీ( Smriti Irani ) గురించి మనందరికీ తెలిసిందే.ఈమె బుల్లితెర నటిగా కూడా మనందరికీ సుపరిచితమే.
మొదట్లో పలు సీరియల్స్ లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు చేరువ అయ్యింది.ఇక బుల్లితెరపై ఆమె రామాయణ్ విరుధ్: హరి రిష్తా ఏక్ కురుక్షేత్ర, హం హై కల్ ఆజ్ ఔర్ కల్, క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ లాంటి సీరియల్స్ నటించి బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది స్మృతి ఇరానీ.కాగా ఆమె సీరియల్స్ లో నటిస్తున్న సమయంలో ఒక మేకప్ మాన్( Makeup man ) ఆమెను దారుణంగా అవమానించాడట.

ఈ విషయాన్ని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న స్మృతి ఇరాని ఈ సందర్భంగా మాట్లాడుతూ.క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ సీరియల్ మొదటి ఏడాది నాకు రోజుకు 1800 రూపాయలు ఇచ్చేవారు.
నాకు అప్పటికి ఇంకా సొంతంగా కారు కూడా లేదు.జుబిన్ ( Zubin )ని పెళ్లి చేసుకున్న తర్వాత మా ఇద్దరికీ కలిపి రూ.30 వేల వరకు వచ్చేది.అయినప్పటికీ నేను షూటింగ్ కి ఆటోలోనే వెళ్ళేదాన్ని.
ఒకరోజు మా మేకప్ నేను రోజు కార్ లో వస్తున్న మీరు ఇలా ఆటోలో వస్తున్నందుకు సిగ్గుగా అనిపించట్లేదా అని ముఖం మీదనే అడిగాడు.

సొంతంగా బండి కొనుక్కోవచ్చు కదా అని చెప్పాడు.ఆ సమయంలో అతడు నన్ను అవమానించే విధంగా మాట్లాడడంతో నాకు బాధ కలిగింది అని చెప్పుకొచ్చింది స్కృతి ఇరాని.సీరియల్ సెట్ లో కూల్ డ్రింక్స్ ఫుడ్ తీసుకోవడానికి వీల్లేదు అని కఠినంగా రూల్స్ కూడా ఉండేవట.
అందుకు గల కారణం అక్కడున్న వస్తువులపై పడితే శుభ్రం చేయడం కష్టం అవుతుందని యూనిట్ వాళ్ళు బాధపడేవారట.దాంతో ఆమె ఎప్పుడైనా కాఫీ టీ తాగాలనిపించినప్పుడు సెట్ నుండి బయటకు వచ్చి టీ తాగుతూ ఆస్వాదించేదట.
ఇదే విషయాన్ని ఆమె చెప్పుకొచ్చింది.ఇంటర్వ్యూలో స్కృతి ఇరాని మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







