వామ్మో.. ఎస్.జె.సూర్య రెమ్యునరేషన్ అన్ని రూ.కోట్లా.. మామూలు డిమాండ్ కాదంటూ?

తెలుగు, తమిళ భాషల్లో నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న నటులలో ఎస్.జె.

 Sj Surya Remuneration Demand Details Here Goes Viral In Social Media , S. J. Su-TeluguStop.com

సూర్య ఒకరు.పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉండటంతో ఎస్.

జె.సూర్యకు( S.J.Surya ) ఆఫర్లు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.నాని కొత్త సినిమా కోసం ఎస్.జె.సూర్యను సంప్రదించగా ఆయన ఏకంగా 10 కోట్ల రూపాయలు ( 10 crore rupees )డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.

10 కోట్ల రూపాయల పారితోషికంతో ఒక చిన్న సినిమాను సులువుగా తీయొచ్చు.వైవిధ్యమైన నటుడిగా పేరు ఉండటం వల్లే ఎస్.జె.సూర్య ఈ రేంజ్ లో డిమాండ్ చేశారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ను డిమాండ్ చేయడంతో మేకర్స్ ఈ సినిమా కోసం మరో నటుడిని తీసుకోనున్నారని తెలుస్తోంది.

నాని వివేక్ ఆత్రేయ ( Nani, Vivek Atreya )కాంబోలో తెరకెక్కిన అంటే సుందరానికి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.

Telugu Crore Rupees, Dvv Danayya, Game Changer, Nani, Surya, Sj Surya, Vivek Atr

ఇదే కాంబినేషన్ లో డీవీవీ దానయ్య( DVV Danayya ) నిర్మాతగా ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా కోసం ఎస్.జె.సూర్య భారీ స్థాయిలో పారితోషికం డిమాండ్ చేసినట్టు సమాచారం అందుతోంది.ఎస్.జె.సూర్య స్థానంలో ఈ సినిమాలో నటించే నటుడు ఎవరనే ప్రశ్నకు త్వరలో సమాధానం దొరికే ఛాన్స్ అయితే ఉంది.ఎస్.జె.సూర్య ప్రస్తుతం తమిళంలో పలు భారీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.

Telugu Crore Rupees, Dvv Danayya, Game Changer, Nani, Surya, Sj Surya, Vivek Atr

రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ ( game changer )సినిమాలో సైతం ఎస్.జె.సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని షాకింగ్ అప్ డేట్స్ రానున్నాయి.

ఎస్.జె.సూర్య సినిమాకు తమిళంలో భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఇస్తుండటం వల్లే ఈ స్థాయిలో ఆయన డిమాండ్ చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సినిమా సినిమాకు ఎస్.జె సూర్య మార్కెట్ పెరుగుతుండటం గమనార్హం.గత కొంతకాలంగా ఎస్.జె.సూర్య డైరెక్షన్ కు దూరంగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube