తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సిట్ అధికారులు కేసు నమోదు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో తన ఆరోపణలపై సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో రేవంత్ రెడ్డిపై చర్యలకు అధికారులు సిద్ధం అవుతున్నారని సమాచారం.
ఒకే మండలానికి చెందిన వంద మందికి వంద మార్కులకు పైగా వచ్చాయని రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.అయితే న్యాయ సలహా తీసుకున్న తర్వాత ఆయనపై సిట్ కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.