టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ప్రవస్తి (pravasthi)కాంట్రవర్సీ హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఈ వివాదం నేపథ్యంలో సింగర్ లిప్సిక (singer lipsika )సైతం రియాక్ట్ అవుతూ చేసిన కామెంట్లు ఒకింత సంచలనం అవుతున్నాయి.
లిప్సిక తన వీడియోలో ప్రవస్తి పాడుతా తీయగా (Padutha Theeyaga)కార్యక్రమంలో ఏం ఫీలైందో అదే చెప్పిందని పేర్కొన్నారు.మనలో ఎంతమందికి ఒక సైడ్ వెర్షన్ అని అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ ఉందని ఆమె ప్రశ్నించారు.
ఏ స్టోరీకైనా రెండు సైడ్స్ ఉంటాయని ఆ సెకండ్ సైడ్ చూడకుండా జడ్జ్ చేయడం కరెక్ట్ కాదని లిప్సిక వెల్లడించారు.ప్రవస్త తన ఫీలింగ్స్ చెబుతూ ఒక వీడియో పెడితే ఇష్టానుసారం 100 వీడియోలు వైరల్ అవుతున్నాయని ప్రవస్తి ప్రమేయం లేకుండా కూడా థంబ్ నెయిల్స్ పెడుతున్నారని ఆమె కామెంట్లు చేశారు.
ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని లిప్సిక ప్రశ్నించారు.
ఇండస్ట్రీ ఎలా వర్క్ అవుతుందో తెలియాలంటే ఎంతో అనుభవం ఉండాలని ఆమె పేర్కొన్నారు.కెరీర్ తొలినాళ్లలో ఎలాంటి సమస్యలు లేకుండా పైకి వచ్చిన వాళ్లు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదని ప్రతి సింగర్, మ్యూజీషియన్(Every singer, musician,) సక్సెస్ వెనుక ఎంతో కష్టం ఉందని లిప్సిక తెలిపారు.ఇందుకు ఎవరూ అతీతులు కారని ఆమె పేర్కొన్నారు.
ఆ షో జడ్జీలు సైతం ఎంతో కష్టపడి పైకి వచ్చిన వాళ్లే అని లిప్సిక వెల్లడించారు.రియాలిటీ షోకు వెళ్లాలా వద్దా అనేది వ్యక్తిగతం అని ఫేవరెటిజం విషయానికి వస్తే నాకు ఎవరైనా మేల్ సింగర్ కావాలని కాల్ చేస్తే నాకు క్లోజ్ గా ఉండేవాళ్లను తెలిసిన వాళ్లను మాత్రమే సూచిస్తానని ఆమె అన్నారు.
మనం మనుషులుగా వాళ్లతో జర్నీ చేయడంతో పాటు చనువును కలిగి ఉంటామని లిప్సిక అన్నారు.
2017, 2018 సమయంలో కీరవాణి సార్ దగ్గరకు కంపోజింగ్ కోసం వెళ్లానని ఆ సమయంలో నేను నా బెస్ట్ ఇవ్వలేదని లిప్సిక తెలిపారు.ఆ తర్వాత ఆరేళ్ల వరకు కీరవాణి సార్ నన్ను పిలవలేదని ఆమె అన్నారు.ఆరేళ్ల తర్వాత నాకు అవకాశం వచ్చిందని ఆమె తెలిపారు.
కీరవాణి గారు చాలా హంబుల్ గా ఉంటారని అందరినీ ఒకే విధంగా చూస్తారని లిప్సిక చెప్పుకొచ్చారు.కీరవాణి గారు లెజెండ్(Keeravani garu is a legend.
) అని ఆమె పేర్కొన్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy