తెలుగు సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్లే బ్యాక్ ఫింగర్లకి కూడా అంతే మంచి క్రేజ్ ఉంటుందని చెప్పాలి.ఇలా ప్లే బ్యాక్ సింగర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సీనియర్ సింగర్ సునీత ( Sunitha ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనే పాట ద్వారా సింగర్ గా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి సునీత ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ సాధించారు.అద్భుతమైనటువంటి గాత్రంతో ఎన్నో మధురమైన పాటలు ఆలపించి ఎంతో మంది అభిమానులను చేసుకున్నారు.
సునీత ఇలా సింగర్ గా మాత్రమే కాకుండా ఈమె డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఇండస్ట్రీలో దాదాపు అందరి హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెబుతూ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా కెరియర్ పరంగా సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని చెప్పాలి.
సునీత గత రెండు సంవత్సరాల క్రితం మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని ( Ram Veerapaneni ) అనే వ్యక్తిని రెండవ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే ఈమె రెండో పెళ్లి చేసుకున్న సమయంలో తన పట్ల ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి అయితే వాటిని లెక్కచేయకుండా ఈమె రెండో పెళ్లి చేసుకుని తన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.

ఇలా ఈమె రెండో పెళ్లి చేసుకోవడంతో తన మొదటి భర్త ఎవరు? మొదటి భర్త నుంచి విడిపోవడానికి కారణం ఏంటి అనే విషయాలు గురించి కూడా అందరూ పెద్ద ఎత్తున ఆరా తీశారు ఇక సునీత 17 సంవత్సరాల వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఆ సమయంలోనే కిరణ్ అనే వ్యక్తి ఈమెను ప్రేమిస్తున్నట్లు తన ప్రేమ విషయాన్ని తెలిపారు.ఇలా కిరణ్( Kiran ) తనని ప్రేమిస్తున్నానని చెప్పడంతో సునీత తన ప్రేమను రిజెక్ట్ చేసింది.ఇలా దాదాపు ఏడాదిన్నర పాటు కిరణ్ ఈమె ప్రేమ కోసం ఎదురు చూడడంతో చివరికి సునీత కూడా తన ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇక వీరి ప్రేమ విషయం సునీత కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ఇంట్లో కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడం వల్ల సునీత ఇంట్లో వారిని ఎదిరించి ఇంటి నుంచి బయటకు వచ్చి కిరణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.ఇక వీరిద్దరిది ఒకటే సామాజిక వర్గం కావడంతో పెళ్లయిన కొద్ది కాలానికి సునీత కుటుంబ సభ్యులకు కూడా కిరణ్ అనే వ్యక్తిని తమ ఇంటి అల్లుడుగా ఆహ్వానించారు.అయితే వీరిద్దరికీ పిల్లలు జన్మించిన తర్వాత సునీత తన మొదటి భర్త నుంచి దూరం అయ్యారు.
పెళ్లయిన తర్వాత తరచూ సునీత తన భర్త మధ్య విభేదాలు రావడం చేతనే ఇద్దరు కూడా విడాకులు తీసుకొని విడిపోయారని తెలుస్తోంది.ఇక సునీత ప్రతి విషయంలోను అడ్జస్ట్ అయినప్పటికీ గొడవ పడటం చేత తనని భరించలేక తన పిల్లలు బాగుండాలని కోరుకున్నటువంటి ఈమె ఆయనకు విడాకులు ఇచ్చి పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ వారిని పెంచి పెద్ద చేశారు.
అయితే సునీత కొడుకు కూతురు పెళ్లికి వచ్చిన తర్వాత తన పిల్లలే స్వయంగా ఈమెకు రెండో పెళ్లి చేయడం గమనార్హం.