ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన సింగర్ సునీత... నాకు సంబంధించినది కాదంటూ కామెంట్స్!

తెలుగు చిత్ర పరిశ్రమలో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ప్రస్తుతం ఈమె వరుస ఈవెంట్లతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే ఈమె రామ్ వీరపనేని అనే వ్యక్తిని రెండవ వివాహం చేసుకున్న అనంతరం తన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.అయితే సునీత ప్రెగ్నెన్సీ గురించి తరచు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి.

ఇలా తన ప్రేగ్నెన్సీ వార్తలు గురించి సునీత స్పందిస్తూ ఎప్పటికప్పుడు ఆ వార్తలను కొట్టి పారేశారు.

ఇకపోతే తాజాగా మరోసారి సునీత ప్రెగ్నెన్సీ గురించి వార్తలు రావడంతో ఈ ప్రెగ్నెన్సీ వార్తలు పై సునీత క్లారిటీ ఇచ్చారు.ఈనెల 26వ తేదీన హైదరాబాద్‌ వేదికగా మ్యాస్ట్రో ఇళయరాజా లైవ్‌ కన్సర్ట్‌ ప్రోగ్రామ్‌ నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో సింగర్ సునీత కూడా పాల్గొనబోతున్నారు ఈ క్రమంలోనే ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తన ప్రెగ్నెన్సీ వార్తలకు ఫుల్ క్లారిటీ ఇస్తూ చెక్ పెట్టారు.

Advertisement

తన ప్రెగ్నెన్సీ రూమర్లపై స్పందించిన సునీత నేను ప్రెగ్నెంటా? నాకే తెలియదు.

నేను ప్రెగ్నెంట్ అంటూ ఈ రూమర్ సృష్టించిన వారి ఆలోచన స్థాయికి సంబంధించిన విషయం.ఇది నాకు కానీ నా జీవితానికి కానీ సంబంధించిన విషయం కాదు అని తన ప్రెగ్నెన్సీ గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.ఇలా సునీత ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించడంతో ఇక ఈ వార్తలకు పులిస్టాప్ పడినట్లేనని అందరూ భావిస్తున్నారు.

ఇక సునీత కుమారుడు సర్కారు నౌకరి సినిమా ద్వారా ఇండస్ట్రీకు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.మరి హీరోగా సునీత కుమారుడు సక్సెస్ అందుకుంటారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

Lorem Ipsum Dolor Sit Amet
Advertisement

తాజా వార్తలు