సింగర్ సునీత సోషల్ మీడియా వేదికగా తన ఫాంహౌస్లో మామిడి పండ్లను చూపిస్తూ ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేస్తూ బ్లెస్డ్ అనే క్యాప్షన్ తో ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ క్రమంలోనే ఈ ఫోటో క్షణాలలో వైరల్ గా మారింది.
సునీత పచ్చి మామిడి పండ్లతో ఫోటో దిగి బ్లెస్డ్ అని క్యాప్షన్ పెట్టడంతో చాలామంది ఈమె మరోసారి తల్లి కాబోతోంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు సృష్టించారు.ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు తనకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేశారు.
ఈ క్రమంలోనే ఈ విషయం గురించి సునీత మరోసారి స్పందించి క్లారిటీ ఇచ్చారు.ఈ సందర్భంగా సునీత సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ… దేవుడా… జనాలు మరి ఇంత క్రేజీగా ఉన్నారేంటి కేవలం మామిడికాయలతో ఫోటో దిగి షేర్ చేస్తే ఏవేవో ఊహించుకుంటున్నారు.
దయచేసి ఇలాంటి పుకార్లను సృష్టించండి మీకో దండం రా నాయనా… అంటూ తన ప్రెగ్నెన్సీ గురించి క్లారిటీ ఇచ్చారు.ఇక ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సునీత తల్లి కాబోతుందనీ వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది./br>

ఇక సునీత కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె ప్లే బ్యాక్ సింగర్ గాను, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు.ఇక ప్రస్తుతం సునీత బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు.ఇక ఈమె మ్యాంగో అధినేత రామ్ అనే వ్యక్తి రెండో పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.