చనిపోయిన కూతురు పేరు పైన సింగర్ చిత్ర ఎంతమందికి సహాయం చేస్తున్నారో తెలుసా ?

సింగర్ చిత్ర .ఈమె కెరీర్ పై ఇప్పటికే మనం ఎన్నో వార్తల్లో, వెబ్ సైట్స్ లో చూస్తున్నాం.

కొత్తగా ఆమె కెరీర్ కి సంబందించిన విషయాల్లోకి వెళ్లడం లేదు కానీ ఆమె జీవితంలో అందరికి తెలిసిన పెద్ద వివాదం ఆమె కూతురు మరణం.సింగర్ చిత్ర విజయశంకర్ అనే ఒక ఇంజనీర్ ని పెళ్లి చేసుకోగా వీరికి చాల ఆలస్యంగా ఒక పాప పుట్టింది.

ఆమె పేరు నందన.అయితే పాప డౌన్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధ పాడేది.

డౌన్ సిండ్రోమ్ వ్యాధి లక్షణం ఏంటంటే మనిషిలో ఎదుగుదల ఉండదు.పాపకు తొమ్మిదేళ్ల వయసు వచ్చాక దుబాయ్ లోని రెహమాన్ కి సంబందించిన ఒక కచేరి లో పాల్గొనడానికి వెళ్లిన సమయంలో పూల్ లో మునిగి నందన కన్ను మూసింది.

Advertisement
Singer Chitra About Snehanandana Trust , Singer Chitra , Snehanandana Trust ,Vi

ఈ విషాదం నుంచి బయటపడడటానికి చిత్రకు చాల సమయం పట్టింది.

Singer Chitra About Snehanandana Trust , Singer Chitra , Snehanandana Trust ,vi

ఇక ఈ సంఘటన 2011 లో జరిగింది.దాంతో 2012 లో తన కూతురి పేరు పైన ఒక చారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసింది చిత్ర.దానికి తన కూతురు పేరు నే స్నేహానందన అని పెట్టుకుంది.

అప్పటి ముఖ్యమంత్రి చేత ట్రస్ట్ ఓపెనింగ్ కార్యక్రమం చేయించింది.ఈ ట్రస్ట్ ద్వారా రకరకాల సేవ కార్యక్రమాలు సైతం చేస్తుంది.

ముఖ్యం గా అరవైయేళ్లు దాటిన సింగర్ లేదా మ్యూజిక్ ఇండస్ట్రీ వారికి ఆర్థికంగా చితికిన వారికి నెలకు మూడు వేళా రూపాయల పెన్షన్ ని అందిస్తుంది.అలాగే తన కూతురు లాగ స్పెషల్ చిల్డ్రన్ కి కూడా చేయూతని అందిస్తుంది.

Singer Chitra About Snehanandana Trust , Singer Chitra , Snehanandana Trust ,vi
అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...

స్పెషల్ చిల్డ్రన్ కి స్పెషల్ స్కూల్ కూడా ఉండాలని ఆ రకంగా కూడా ప్రయత్నాలు చేస్తుంది.ఆలా కేవలం తన కూతురిలాగా మాత్రమే కాకుండా సంగీత ప్రపంచంలో ఆదరణ కోల్పోయిన వారికి కూడా సహాయం చేస్తూ ఎంతో మందికి ఉపయోగపడుతుంది.ఇలా చిత్ర కేవలం అందంగా పాటలు పడటమే కాదు అందమైన మనసు కలిగిన వ్యక్తి అని నిరూపించుకుంటుంది.

Advertisement

తనకు బయట నుంచి కూడా చాల మంది ఈ ట్రస్ట్ నడపడానికి సహాయం చేస్తున్నారని తెలిపిన చిత్రమ్మ భవిష్యత్తులో మరింత మందికి సహాయం చేకూరేలా ప్రయత్నిస్తాను అని చెప్తున్నారు.

తాజా వార్తలు