పుష్కర శోభను సంతరించుకోనున్న సింధూ నది.. ఈ నెల 20 నుంచి సింధు పుష్కరాలు..!

మన భారతావనిలో ఎన్నో పవిత్రమైన నదులు ఉన్నాయి.నదులను సాక్షాత్తు దైవ సమానంగా భావించి వాటికి పూజలు చేస్తుంటాము.

గంగా, యమున, సింధు, కృష్ణ, గోదావరి వంటి ఎన్నో నదులు మన దేశాన్ని సస్యశ్యామలం చేస్తున్నాయి.ఇలా మన దేశంలో పుట్టిన ప్రతి నది వెనుక ఎన్నో పౌరాణిక కథలు ఉన్నాయి.

ఒక్కో నదికి ఒక్కో ప్రాధాన్యత సంతరించుకుంది.అలా పవిత్రమైన నదులలో ఒకటిగా పేరుగాంచినది సింధునది.

సాధారణంగా ప్రతి నదికి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పన్నెండు రోజులపాటు పుష్కరాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు.ఈ క్రమంలోనే సింధూ నది పుష్కరాలు కూడా మరికొన్ని రోజులలో ప్రారంభంకానున్నాయి.సింధూ నది కార్తీక మాసం కృష్ణపక్ష పాడ్యమి శనివారం నవంబర్ 20వ తేదీ గురువు కుంభ రాశిలోకి ప్రవేశించడం వల్ల సింధూ నది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి.20వ తేదీ నుంచి 12 రోజుల పాటు డిసెంబర్ 1వ తేదీ వరకు సింధూ నదికి పుష్కరాలు చేయనున్నారు.టిబెట్ లోని మానససరోవరానికి వద్ద జన్మించిన సింధునది మనదేశంలో జమ్ము కాశ్మీర్ లో ప్రవహిస్తూ పాకిస్తాన్ లోకి అడుగుపెట్టి చివరికి అరేబియా సముద్రంలోకి కలిసిపోతుంది.

Advertisement
Sindhu River Pushkaralu From The 20th Of This Month Sindhu River, Pushkaralu, 20

ఈ నదికి ఎన్నో ఉప నదులు ఉన్నాయి.

Sindhu River Pushkaralu From The 20th Of This Month Sindhu River, Pushkaralu, 20

ఈ క్రమంలోనే సింధునదికి 20వ తేదీ నుంచి పుష్కరాలు ప్రారంభం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు పూజా కార్యక్రమాలను చేయడమే కాకుండా ఈ నదిలో స్నానాలు చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని భావిస్తారు కనుక పెద్ద ఎత్తున భక్తులు ఈ పుష్కరాలలో పాల్గొంటారు.ఈ పుష్కర సమయంలో ఎంతో మంది వారి పితృదేవతలకు పిండ ప్రధాన కార్యక్రమాలను నిర్వహిస్తారు.అదే విధంగా దానధర్మాలను చేయటం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుందని చెప్పవచ్చు.

ఇక మన దేశంలో ఈ పుష్కరాలు లద్దాఖ్‌లోని లేహ్‌, శ్రీనగర్‌ సమీపంలోని గంధర్‌బాల్‌ ప్రాంతాల్లో సింధూ నది పుష్కరాలలో పాల్గొనవచ్చు.

Jyothamma Jabardast : మానవత్వం మర్చిపోయిన ఓ సమాజమా ..అగ్గి తో కడగాలి నిన్ను !
Advertisement

తాజా వార్తలు