జుట్టు వ‌ర్షంలో త‌డిచి వాస‌న వ‌స్తుందా? అయితే ఈ చిట్కాలు మీకోస‌మే!

వేస‌వి వేడి నుండి ఉప‌శ‌మ‌నాన్ని అందించి మ‌న‌సును ఆహ్లాద‌భ‌రితంగా మార్చే వ‌ర్షాకాలం రానే వ‌చ్చింది.జోరుగా వ‌ర్షాలు కురుస్తుంటే.

 Simple Tips To Get Rid Of Bad Smell From Hair In The Rainy Season Details! Simpl-TeluguStop.com

కఠినమైన వేడి వాతావరణం తరువాత కాస్త సేద తీరినట్లు అవుతుంది.కానీ, మిగిలిన సీజ‌న్ల‌తో పోలిస్తే వ‌ర్షాకాలం ఎంతో ప్ర‌మాద‌క‌ర‌మైన‌ది.

ఈ సీజ‌న్‌లో ఆరోగ్య, చ‌ర్మ స‌మ‌స్య‌లే కాదు కేశ సంబంధిత స‌మ‌స్య‌లు అధికంగానే ఉంటాయి.ముఖ్యంగా హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్‌, చుండ్రు ఇలా ఎన్నెన్నో స‌మ‌స్య‌లు స‌త‌మ‌తం చేస్తుంటాయి.

అలాగే వ‌ర్షంలో త‌డిచిన‌ప్పుడు జుట్టు నుండి ఎంత‌టి చెడు వాస‌న వ‌స్తుందో ప్ర‌త్యేకంగా వివ‌రించ‌న‌క్క‌ర్లేదు.ఒక్కోసారి షాంపూ చేసుకున్నా ఆ చెడు వాస‌న పోదు.

అలాంట‌ప్పుడు ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ చిట్కాల‌ను పాటిస్తే చాలా సుల‌భంగా బ్యాడ్ స్మెల్‌ను పోగొట్టుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు లేటు ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

వ‌ర్షంలో త‌డిచిన త‌ర్వాత జుట్టు నుండి వ‌చ్చే చెడు వాస‌న‌ను నివారించ‌డంలో ఆరెంజ్ జ్యూస్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.రెండు, మూడు ఆరెంజ పండ్ల నుంచి జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసుకుని.

స్ప్రే బాటిల్‌లో నింపుకోవాలి.ఆపై స్కాల్ప్ తో జుట్టు మొత్తానికి ఆరెంజ్ జ్యూస్‌ను స్ప్రే చేసుకుని ఓ న‌ల‌బై నిమిషాల పాటు వ‌దిలేయాలి.

అనంత‌రం మైల్డ్ సాంపూతో త‌ల‌స్నానం చేస్తే చెడు వాస‌న పోతుంది.

Telugu Bad Smell, Care, Care Tips, Fall, Latest, Rainy Season, Simple Tips-Telug

అలాగే ఒక అర‌టి పండును తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్‌లో మూడు టేబుల్ స్పూన్ల ప‌చ్చి పాలు, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి మిక్స్ చేసి.జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించాలి.

గంట త‌ర్వాత శుభ్రంగా త‌ల‌స్నానం చేయాలి.ఇలా చేస్తే బ్యాడ్ స్మెల్ పోవ‌డ‌మే కాదు హెయిర్ ఫాల్ స‌మ‌స్య సైతం త‌గ్గుతుంది.

Telugu Bad Smell, Care, Care Tips, Fall, Latest, Rainy Season, Simple Tips-Telug

ఒక మ‌రో చిట్కా ఏంటంటే.స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక‌టిన్న‌ర గ్లాస్ వాట‌ర్‌, రెండు టేబుల్ స్పూన్ల దాల్చిన చెక్క పొడి వేసి బాగా మ‌రిగించి వాట‌ర్‌ను ఫిల్ట‌ర్ చేసుకోవాలి.ఈ వాట‌ర్‌ను స్ప్రే బాటిల్‌లో నింపుకుని.జుట్టు మొత్తానికి స్ప్రే చేసుకోవాలి.గంట త‌ర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి.ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube