తమ ముఖ చర్మం వైట్ అండ్ బ్రైట్ గా మెరిసిపోవాలని చాలా మంది తెగ ఆరాటపడుతూ ఉంటారు.
అందులోనూ ఏదైనా ఫంక్షన్ లేదా పెళ్లి ఉందంటే చర్మాన్ని మెరిపించుకోవడం కోసం ఇంకా తాపత్రయపడుతుంటారు.
ఈ క్రమంలోనే తోచిన చిట్కాలు అన్నీ పాటిస్తుంటారు.ఇంకొందరు వేలకు వేలు ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్‌లో ఫేషియల్ చేయించుకుంటారు.
ఈ లిస్ట్ లో ఉన్నారా.? అయితే తప్పకుండా మీరు ఇప్పుడు చెప్పబోయే చిట్కాను పాటించాల్సిందే.ఈ చిట్కాను పాటించడం వల్ల సహజంగానే చర్మం తెల్లగా మరియు కాంతివంతంగా మారుతుంది.
అదే సమయంలో మరెన్నో ప్రయోజనాలు సైతం లభిస్తాయి.ఇంతకీ ఆ సింపుల్ చిట్కా ఏంటి అనేది లేట్ చేయకుండా ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక టమాటో ని తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, అర కప్పు కొబ్బరి ముక్కలు, ఒక కప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ టమాటో, కొబ్బరి జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ వెజిటేబుల్ గ్లిజరిన్ వేసి బాగా మిక్స్ చేయాలి.
ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని దూది సహాయంతో ముఖానికి ఒకటికి రెండు సార్లు అప్లై చేసుకోవాలి.అరగంట అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే చర్మం తెల్లగా మరియు కాంతివంతంగా మారుతుంది.చర్మంపై మొండి మచ్చలు ఉంటే దూరం అవుతాయి.
మొటిమలు చాలా త్వరగా తగ్గు ముఖం పడతాయి.మరియు చర్మం షైనీగా సైతం మెరుస్తుంది.
కాబట్టి, తప్పకుండా ఈ చిట్కాను పాటించేందుకు ప్రయత్నించండి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy