మొటిమలు మచ్చలు గా మారుతున్నాయా.. అయితే ఈ సింపుల్ చిట్కాతో వాటికి బై బై చెప్పండి!

సర్వసాధారణంగా వేధించే చర్మ సమస్యల్లో మొటిమలు( Acne ) ముందు వరుసలో ఉంటాయి.అయితే మొటిమలు కొందరికి చాలా త్వరగా తగ్గిపోతాయి.

కానీ కొందరికి మాత్రం నాలుగైదు రోజుల వరకు తగ్గవు.ఇంకొందరికి మొటిమలు మచ్చలుగా మారుతుంటాయి.

ఈ మచ్చలు ముఖ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.అలాగే ఈ మచ్చలు కారణంగా చాలా మంది మానసిక వేదనకు గురవుతుంటారు.

ఈ మచ్చలను ఎలా వదిలించుకోవాలో తెలియక తెగ మదన పడుతూ ఉంటారు.అయితే అస్సలు వర్రీ అవ్వకండి.

Advertisement
Simple Remedy For Removing Acne Scars Details! Simple Remedy, Acne Scars, Acne,

ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను పాటిస్తే మొటిమలు తాలూకు మచ్చలకు( Pimples ) చాలా సులభంగా బై బై చెప్పవచ్చు.మరి ఇంకెందుకు లేటు ఆ సింపుల్ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక చిన్న టమాటో ని( Tomato ) తీసుకుని వాటర్ తో కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక బంగాళదుంప ని( Potato ) కూడా తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, టమాటో ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Simple Remedy For Removing Acne Scars Details Simple Remedy, Acne Scars, Acne,

ఈ మిశ్రమం నుంచి స్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు నీరు తొలగించిన పెరుగును( Curd ) వేసుకోవాలి.అలాగే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు పొటాటో-టమాటో జ్యూస్, హాఫ్ టేబుల్ స్పూన్ తేనె వేసుకొని అన్నీ కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.

Simple Remedy For Removing Acne Scars Details Simple Remedy, Acne Scars, Acne,
సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి.ప‌ది నిమిషాల పాటు చ‌ర్మాన్ని ఆర‌నిచ్చి.అనంతరం వేళ్ళతో ముఖాన్ని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

Advertisement

ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మసాజ్ చేసుకున్న అనంతరం గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఈ విధంగా కనుక చేస్తే మొటిమలు తాలూకు మచ్చలే కాదు ఏ మచ్చలు ఉన్నా సరే దెబ్బకు మాయం అవుతాయి.

క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.కాబట్టి మొటిమలు తాలూకు మచ్చలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

బెస్ట్ రిసల్ట్ మీ సొంతం అవుతుంది.

తాజా వార్తలు