రాత్రి నిద్రించే ముందు ఇలా చేస్తే ఎలాంటి మ‌చ్చ‌లైనా ప‌రార్‌!

ముఖ చ‌ర్మంపై మొటిమ‌ల కార‌ణంగానో, హార్మోన్ ఛేంజ‌స్ వ‌ల్ల‌నో లేదా ఇత‌రిత‌ర కార‌ణాల వ‌ల్లో మ‌చ్చలు ఏర్ప‌డుతుంటాయి.

ఆ మ‌చ్చ‌ల‌ను నివారించుకునేందుకు ఎన్నెన్నో క్రీములు, లోష‌న్లు, సీర‌మ్‌లు వాడుతుంటారు.

ర‌క‌ర‌కాల ఫేస్ ప్యాక్స్ వేసుకుంటారు.చ‌ర్మంపై చేయాల్సిన ప్ర‌య‌త్నాలు అన్నీ చేసేస్తుంటారు.

అయిన‌ప్ప‌టికీ మ‌చ్చ‌లు త‌గ్గ‌కుంటే హాస్ప‌ట‌ల్స్ చుట్టూ తిరుగుతారు.అయితే ఎలాంటి ఖ‌ర్చు లేకుండా ఇంట్లోనే రాత్రి నిద్రించే ముందు ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా చేస్తే ఎలాంటి మ‌చ్చ‌లైనా ప‌రార్ అవ్వ‌డం ఖాయం.

మ‌రి ఎందుకు లేటు అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం ప‌దండీ.

స్టెప్ -1:

ముందుగా ఫేస్ కి ఉన్న మేక‌ప్ మొత్తాన్ని తొల‌గించి వాట‌ర్‌తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇప్పుడు వేడి నీటితో ముఖానికి రెండంటే రెండు నిమిషాల పాటు ఆవిరి ప‌ట్టుకుని ఆపై కాట‌న్ క్లాత్‌తో ముఖాన్ని తుడుచుకోవాలి.

Simple Remedies To Get Rid Of Dark Spots On Face Simple Remedies, Dark Spots, D
Advertisement
Simple Remedies To Get Rid Of Dark Spots On Face! Simple Remedies, Dark Spots, D

స్టెప్ -2:

ఇప్పుడు కొబ్బ‌రి నూనె లేదా బాదం నూనెను తీసుకుని ముఖానికి అప్లై చేసి ఐదు నుంచి ప‌ది నిమిషాల పాటు స్మూత్‌గా మ‌సాజ్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత త‌డి క్లాత్‌తో ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి.

స్టెప్‌-3:

ఒక బంగాళ‌దుంప తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి ర‌సం తీసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్‌తో బంగాళ దుంప ర‌సం, ఒక స్పూన్ గ్లిజ‌రిన్‌, రెండు విట‌మిన్ ఇ క్యాప్సుల్ ఆయిల్‌, అర స్పూన్ నిమ్మ ర‌సం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆపై ఈ మిశ్ర‌మాన్ని దూది సాయంతో ముఖానికి అప్లై చేసుకుని.ప‌ది హేను నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.అనంత‌రం కూల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.

ఇలా రాత్రి నిద్రించే ముందు చేస్తే గ‌నుక ఎటువంటి మ‌చ్చ‌లైనా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.మ‌రియు ముఖం కాంతివంతంగా మారుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు