అజీర్తికి ఔషధం పుదీనా.. ఇలా తీసుకున్నారంటే క్షణాల్లో రిలీఫ్ మీ సొంతం!

వయసుతో సంబంధం లేకుండా దాదాపు అందర్నీ అత్యంత సర్వసాధారణంగా ఇబ్బంది పెట్టే జీర్ణ సమస్యల్లో అజీర్తి( indigestion ) ఒకటి.

తిన్న ఆహారం అరగకపోవడం వల్ల కడుపు అంతా ఉబ్బరంగా ఉంటుంది.

తీవ్ర అసౌకర్యానికి గురవుతుంటారు.ఈ క్రమంలోనే అజీర్తి నుంచి బయటపడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

అయితే అజీర్తికి పుదీనా ఔషధంలా పనిచేస్తుంది.ముఖ్యంగా పుదీనాను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకున్నారంటే క్షణాల్లో అజీర్తి నుంచి రిలీఫ్ పొందుతారు.

అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఐరన్ కడాయి( Iron Kadai ) పెట్టుకుని అందులో ఒక కప్పు కడిగి పూర్తిగా ఆరబెట్టుకున్న పుదీనాను( Mint ) వేసుకుని కరకరలాడేలా వేపుకోవాలి.ఆ తర్వాత అదే కడాయిలో రెండు స్పూన్లు జీలకర్ర, పది మిరియాలు వేసి వేయించుకోవాలి.

Advertisement

ఇప్పుడు మిక్సీ జార్ లో డ్రై రోస్ట్ చేసుకున్న పుదీనా ఆకులు, మిరియాలు మరియు జీలకర్ర వేసి మెత్తని పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి.ఈ పౌడర్ ను ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటుంది.

ఇక అజీర్తి బారిన పడినప్పుడు త‌యారు చేసుకున్న పొడిని పావు టేబుల్ స్పూన్ చొప్పున ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలిపి సేవించాలి.అజీర్తి మరియు ఇతర జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో పుదీనా, జీలకర్ర, మిరియాలు( Mint, cumin, pepper ) ప్రభావవంతంగా ఉంటాయి.పుదీనా, జీలకర్ర మరియు మిర్యాలతో తయారు చేయబడిన పొడిని మీరు కావాలి అనుకుంటే నిత్యం కూడా తీసుకోవచ్చు.

ఈ పొడి జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపించి జీర్ణవ్యవస్థను ప్రోత్సహించడంలో సహాయపడుతాయి.ఫలితంగా గ్యాస్, అజీర్తి, మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలు మీ దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.పైగా ఈ పొడిలో ఉండే విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్స్‌ మన రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి.

అనేక జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తాయి.అంతేకాదు ఈ పొడి బరువు తగ్గడంలో తోడ్పడుతుంది.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!

నిత్యం ఈ పొడిని వాటర్ లో కలిపి తీసుకోవడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది.దాంతో కేలరీలు కరిగే వేగం పెరిగి త్వరగా బరువు తగ్గుతారు.

Advertisement

తాజా వార్తలు