అమెరికాలో సిక్కు వ్యక్తిపై జాత్యహంకార దాడి

విదేశీయులపై ముఖ్యంగా భారతీయులపై అమెరికన్ల జాత్యహంకార దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

తాజాగా ఓ సిక్కు వ్యక్తిపై ఓ అమెరికన్ పౌరుడు జాతినుద్దేశించి అసభ్యంగా మాట్లాడటంతో పాటు దాడికి పాల్పడ్డాడు.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన డిసెంబర్ 5న వాషింగ్టన్‌కు సమీపంలోని బెల్లింగ్‌హామ్‌లో జరిగింది.గ్రిఫిన్ లెవి సేయర్స్ అనే అమెరికన్ యువకుడు ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు.

దీనికి భారతీయ సిక్కు వ్యక్తి డ్రైవర్‌గా వ్యవహరిస్తున్నాడు.సేయర్స్‌పు పికప్ చేసుకున్న డ్రైవర్ గమ్యస్థానం వైపు వేగంగా వెళుతున్నాడు.

ఈ క్రమంలో సేయర్స్ ఆ సిక్కు వ్యక్తి జాతిపై రెచ్చగొట్టేలా వ్యాఖ్యానిస్తూ అవమానించడం మొదలుపెట్టాడు.

Advertisement

అక్కడితో ఆగకుండా అతనిపై దాడికి దిగి గొంతు పిసికాడు.సేయర్స్ బారి నుంచి తప్పుకున్న సిక్కు డ్రైవర్ 911కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు.రంగంలోకి దిగిన పోలీసులు సేయర్స్‌ను అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.అనంతరం రూ.9,18,282 పూచీకత్తుపై బెయిల్‌పై విడుదల చేశారు.కాగా సిక్కులు వారి తలపాగా, వస్త్రధారణ కారణంగా తరచుగా అమెరికన్ల చేతిలో జాతి వివక్షకు గురవుతున్నారు.

దీనిపై యూఎస్‌లోని పలు సిక్కు సంఘాలు అవగాహన కల్పించేందుకు ఎంతగానో కృషి చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు