మనం ఇంతకుముందు చదువుకున్నట్టుగా, " Prevention is better than cure" అని అంటారు పెద్దలు.
అంటే సమస్యను వచ్చాక వదిలించుకోవడం కంటే, రాకుండా అడ్డుకోవడం మేలు.
హార్ట్ ఎటాక్ చెప్పి రాదు కదా.వస్తే ఉంటామో పోతామో కూడా చెప్పలేం.అలాంటి ప్రమాదకరమైన హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కొన్ని సంకేతాలిస్తుంది.
వాటిని మనం పసిగట్టి, తొందరగా డాక్టర్ ని ఆశ్రయించాలి.* కారణం లేకుండా మైకం కమ్మినట్టు అనిపించడం, తలనొప్పి మాటిమాటికి వస్తుండటం మంచి సంకేతాలు కాదు.
మీ గుండె మెదడుకి రక్తాన్ని సరిగా సరఫరా చేయలేకపోతోంటే ఇలా జరుగుతుంది.దీనర్థం గుండె ఆరోగ్యంగా లేదు.
* ఛాతి పట్టేసినట్టు, మంటగా, నొప్పిగా, గుండెమీద బరువు మోపినట్టు రెగ్యులర్ గా అనిపిస్తే గుండె ప్రమాదంలో ఉన్నట్టే.* దీర్ఘకాలిక ఇంఫెక్షన్లు కనబడితే అలర్ట్ అవండి.
గుండెకి ఆక్సిజన్ సరిగా అందకపోతే ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది.తద్వారా వారాలకొద్ది, నెలల కొద్ది, జలుబు, జ్వరం వంటి సమస్యలు వస్తాయి.
* పనేం చేయకుండానే అలసిపోవడం, అసలేమాత్రం ఉత్సాహంగా ఉండకపోవడమే కూడా ప్రమాదకర సంకేతాలు.* శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నా, గుండె ప్రమాదంలో ఉన్నట్లే.
గుండె ఆరోగ్యంగా లేకపోతే ఊపిరితిత్తులు కూడా సరిగా పనిచేయలేవు.* చేతులు, పాదాలు, పొట్ట దగ్గర వాపులు కనబడుతున్నాయంటే గుండె రక్తాన్ని సరిగా శుద్ధి చేయలేకపోతోంది అన్నమాట.
అలాంటిప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ ని సంప్రదించండి.* మంచి ఆహారం తీసుకున్నా వికారం, అజీర్ణం లాంటి సమస్యలతో పాటు ఛాతిలో మంటగా అనిపిస్తే జాగ్రత్తగా మెదలడం మొదలుపెట్టండి.
వైద్యుడిని సంప్రదించి వెంటనే పరీక్షలు చేయించుకోవాలి.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy