తాంబూలం ఇచ్చేటప్పుడు సరైన పద్ధతి పాటించకపోతే దోషం కలగడం ఖాయం..!

పండుగలు, పర్వదినాలు, వివాహాలు వంటి ప్రత్యేక సందర్భాలలో ఆడవారు తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు.

ఎవరైనా పెద్ద ముత్తయిదువలు ఇంటికి వచ్చిన బొట్టు పెట్టి తాంబూలం( Tambulam ) ఇస్తారు.

తాంబూలాలు ఇవ్వడానికి ఒక పద్ధతి కచ్చితంగా ఉంటుంది.ఎలా పడితే అలా తాంబూలం ఇస్తే దాని ఫలితం ఉండకపోవడమే కాకుండా దోషం కూడా ఉంటుందని పెద్దవారు చెబుతూ ఉంటారు.

నోములు, పూజలు, వ్రతాల సమయంలో ఎక్కువగా మహిళలు తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు.తాంబూలం ఇచ్చేందుకు కావాల్సిన అని వస్తువులు తెచ్చుకుంటూ ఉంటారు.

కానీ ఇచ్చే పద్ధతిని కొందరు సరిగ్గా పాటించరు.తాంబూలం ఇవ్వడంలోనే మీరు ఎదుటివారి శ్రేయస్సు ఎంతగా కోరుకుంటున్నారో అర్ధమైపోతుంది.అసలు తాంబూలం ఎందుకు ఎలా ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముందుగా మూడు కానీ అంతకంటే ఎక్కువ కానీ తమలపాకులు( Betel Leaves ) తీసుకోవాలి.అవి శుభ్రంగా నీటితో కడిగినవి అయి ఉండాలి.

ఆకు తొడిమలు మన వైపు ఉండేలా చూసుకోవాలి.ఆకులో వేసే వక్క కూడా ఒకటి తీసుకోకూడదు.

రెండు ఖచ్చితంగా తీసుకోవాలి.మీరు ఎంత డబ్బు దక్షిణగా పెట్టాలి అనుకున్న ఆ డబ్బుతో పాటు ఒక రూపాయి విడిగా తాంబూలంలో పెట్టాలి.

ఇక అరటి, ఆపిల్ పండ్లు తాంబూలంలో ఇవ్వవచ్చు.అయితే అవి కూడా రెండు తీసుకోవాలి.ఇంకా చెప్పాలంటే పసుపు( Turmeric ), కుంకుమ, పువ్వులు ఇవన్నీ కూడా వాటికి చేర్చుకోవచ్చు.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్15, ఆదివారం2024

ఇలా తాంబూలంకి ఇవ్వాల్సినవన్నీ సర్దుకున్నాక ముత్తయిదువ కాళ్లకు పసుపు రాయాలి.పసుపు నేలకు అంటకుండా క్లాత్ లేదా బ్యాట్ మీద వారి పాదాలను ఉంచి పసుపు రాయడం మంచిది.

Advertisement

కొంతమంది పారాణి కూడా పెడతారు.మెడకు గంధం రాసి ముత్తయిదువకు కుంకుమ బొట్టు పెట్టి తాంబూలం ఇస్తారు.

తర్వాత తాంబూలం తీసుకున్నవారు ఇచ్చిన వారికి కుంకుమ బొట్టు పెడతారు.వరలక్ష్మి వ్రతం( Varalakshmi Vratham ) రోజు తాంబూలం ఉదయం వేళ ఇస్తారు.

లేదంటే సాయంత్రం కూడా ఇవ్వవచ్చు.కానీ చీకటి పడక ముందే తాంబూలం ఇవ్వడం మంచిది.

ఇలాంటి కొన్ని పద్ధతులు కచ్చితంగా పాటించడం వల్ల ఇచ్చిన వారికి, తీసుకున్న వారికి దోషం ఉండదు అని పండితులు చెబుతున్నారు.

తాజా వార్తలు