కివీ పండు ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఇలా తింటే చాలా డేంజర్!

ఈ ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన పండ్లలో కివీ ఒకటి.కివీ పండ్ల ఖరీదు కాస్త ఎక్కువే అయినప్పటికీ.

కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాపర్, జింక్, నియాసిన్, బీటా కెరోటిన్, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ బి మొదలైన పోషకాలు పుష్కలంగా నిండి ఉంటాయి.అలాగే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా కివీ పండ్ల‌లో నిండి ఉంటాయి.

అందుకే ఆరోగ్య ప‌రంగా కివీ పండ్లు అనేక ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తాయి.ముఖ్యంగా ఇమ్యూనిటీ సిస్టం ను బూస్ట్ చేయడానికి, రక్తహీనత స‌మ‌స్య‌ను తరిమి కొట్టడానికి, ప్లేట్ లెట్స్ ను పెంచడానికి కివీ పండ్లు గ్రేట్ గా హెల్ప్ చేస్తాయి.

అంతేనా.మ‌ధుమేహం ఉన్న వారు కివీ పండ్లు తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.

Advertisement

గుండె జబ్బులు వచ్చే రిస్క్ ను తగ్గించడానికి సైతం కివీ పండ్లు ఎంతగానో సహాయపడతాయి.అయితే ఆరోగ్యానికి ఎంత మంచి చేసినప్పటికీ కివీ పండ్లను అతిగా తీసుకుంటే మాత్రం చాలా డేంజర్ అని అంటున్నారు నిపుణులు.

కివీ పండ్లు అతిగా తీసుకుంటే కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, వికారం, వాంతులు వంటి సమస్యల‌ను ఫేస్ చేయాల్సి ఉంటుంది.అలాగే ఈ పండ్లను ఓవర్ గా తీసుకోవ‌డం వల్ల చర్మంపై దద్దుర్లు, వాపులు, మంటలు ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువ‌గా ఉంటాయి.కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు కివీ పండును ఎవైడ్ చేయడమే మంచిది.

ఎందుకంటే కివీ పండులో పొటాషియం అధికంగా ఉంటుంది.ఇది మూత్రపిండాల పనితీరును మరింత దెబ్బ తీస్తుంది.

ఇక కివీ పండ్ల‌ను లిమిట్ లేకుండా తినేస్తే నోటిలో తీవ్రమైన చికాకు కలుగుతుంది.చాలా మందిలో కివీని అధికంగా తీసుకోవడం వల్ల నోటి అలర్జీ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.కాబట్టి ఆరోగ్యానికి ఎంత మేలు చేసిన‌ప్ప‌టికీ మితంగా తీసుకుంటేనే ఫలితాలు లభిస్తాయి.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

లేదంటే మొదటికే మోసం వస్తుంది.ఇందుకు కివీ పండు కూడా మినహాయింపు కాదు.

Advertisement

తాజా వార్తలు