కారం ఎక్కువ‌గా తింటున్నారా..అయితే ఇవి తెలుసుకోండి!

సాధార‌ణంగా కొంద‌రికి ఫుడ్ స్పైసీగా ఉంటే మ‌హా ఇష్టం.అందుకోసం కారాన్ని ఎక్కువ‌గా వినిప‌యోగిస్తారు.

అంతేకాదు, ఇలాంటి వారు తాము కారం ఎక్కువ‌గా తింటామ‌ని అదేదో పెద్ద ఘ‌న‌కార్యంలా చెప్పుకుంటారు.కానీ, నిజానికి వారికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.

కారం ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల అనేక జ‌బ్బుల‌ను తెచ్చిపెట్టుకున్న‌ట్టే అవుతుంది.అవును, మోతాదుకు మించి కారాన్ని తీసుకుంటే.

అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.మ‌రి అవేంటో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.

Advertisement
Side Effects Of Eating Too Much Of Chilli Powder! Side Effects , Chilli Powder,

కారం కారంగా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉష్ణోగ్ర‌త‌లు పెరిగి పోతాయి.దాంతో చెమ‌ట‌లు అధిక‌మై.

చికాకు, చురుకుత‌నం త‌గ్గ‌డం, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి.అలాగే కారం ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల ఆక‌లి కూడా ఎక్కువ‌గా ఉంటుంది.

ఈ క్ర‌మంలోనే ఏది ప‌డితే అది లాంగించేస్తారు.ఫ‌లితంగా బ‌రువు పెరుగి పోతారు.

కారాన్ని అతిగా వాడ‌టం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డి.గ్యాస్‌, ఎసిడిటీ, ఛాతిలో మంట‌, క‌డుపు ఉబ్బ‌రం వంటి జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి.

న్యూస్ రౌండప్ టాప్ 20

క‌డుపు అల్స‌ర్ స‌మ‌స్య‌తో బాధ ప‌డే వారు కారం అధికంగా తీసుకుంటే.స‌మ‌స్య మ‌రింత తీవ్రం అవుతుంది.

Advertisement

ఇక కారాన్ని ఓవ‌ర్‌గా వాడ‌టం వ‌ల్ల త‌ర‌చూ తల తిరుగుడు, కళ్ళు బైర్లు కమ్మడం వంటి స‌మ‌స్య‌లు కూడా ఎదుర‌వుతాయి.

Side Effects Of Eating Too Much Of Chilli Powder Side Effects , Chilli Powder,

అంతేకాదు, కారంగా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మ సౌంద‌ర్యం కూడా దెబ్బ తింటుంది.ముఖ్యంగా కారాన్ని అతిగా తీసుకుంటే.చిన్న వ‌య‌సులో చ‌ర్మం ముడ‌త‌లు రావ‌డం, స‌న్న‌ని గీత‌లు ఏర్ప‌డ‌టం జ‌రుగుతుంది.

మ‌రియ చ‌ర్మ కాంతి కూడా త‌గ్గ ముఖం ప‌డుతుంది.కాబ‌ట్టి, ఈ స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉండాలీ అంటే.

కారాన్ని ఓవ‌ర్‌గా కాకుండా త‌గిన మోతాదులో మాత్ర‌మే తీసుకోండి.

తాజా వార్తలు